हिन्दी | Epaper

Online betting: మరో యువకుడి ప్రాణం తీసిన ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్‌

Sharanya
Online betting: మరో యువకుడి ప్రాణం తీసిన ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లాలో ఆన్‌లైన్ గేమ్స్‌కు మరో యువకుడు బలయ్యాడు. పరిగి మండలం పైడేటి గ్రామానికి చెందిన జయచంద్ర (23) డిగ్రీ పూర్తి చేసిన అనంతరం గ్రామంలోనే డెయిరీ వ్యాపారం ప్రారంభించాడు. గ్రామీణ యువకుడిగా ఉపాధి మార్గం సృష్టించుకోవడమే కాకుండా ఇతర రైతులకు ఉపయుక్తమయ్యే విధంగా వ్యవహరించాడు. అయితే వ్యాపారంలో ఎదురైన సమస్యలు, ఆర్థిక ఒత్తిడితో పాటు ఆన్‌లైన్ గేమింగ్‌లో పడి, అతని జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేశాయి.

ఆర్థిక భారాలు, ఒత్తిడి

డెయిరీ నిర్వహణలో రైతులకు చెల్లించాల్సిన 3 లక్షల రూపాయల బాకీ వల్ల గ్రామస్థుల ఒత్తిడి పెరిగింది. అదే సమయంలో ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడి, మరో 3 లక్షల రూపాయలు అప్పు చేసి నష్టపోయాడు. ఈ రెండూ కలిసి అతనిపై తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగించాయి. నెల రోజుల క్రితం డెయిరీ మూసివేశాడు. బెంగళూరుకు ఉద్యోగం కోసం వెళ్తున్నట్లు చెప్పిన జయచంద్ర, హిందూపురం పట్టణ పరిధిలోని గుడ్డం ప్రాంతంలో రైలు పట్టాలపై తల పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. శరీరాన్ని పరిశీలించిన పోలీసులు అతని చొక్కాపై ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దు అనే వాక్యం రాసి ఉండటాన్ని గుర్తించారు. ఈ మాట అతని చివరి హెచ్చరికగా నిలిచింది. ఆన్‌లైన్ గేమ్స్ గతంలో కేవలం వినోదం కోసం మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఆర్థిక వ్యసనాలుగా, మానసిక అనారోగ్యాలకు దారితీసే విధంగా రూపాంతరం చెందాయి. ముఖ్యంగా రియల్ మనీ గేమ్స్, బెట్టింగ్ యాప్‌లు, స్లాట్ గేమ్స్ వంటి యాప్స్ యువతను బానిసలుగా మార్చేస్తున్నాయి.

Read also: Cricket Betting Case : వైసీపీ నేతపై ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసు నమోదు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870