हिन्दी | Epaper

Nellore: పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

Aanusha
Nellore: పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

Nellore: నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్.పి. డా. అజిత వేజెండ్ల తెలిపారు. మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించబడనున్నాయని, జిల్లాలో మొత్తం 176 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరుగనున్నట్లు ఎస్పీ తెలిపారు.పరీక్షల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ తరఫున అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. పరీక్షా పత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయడంతో పాటు, పరీక్ష పేపర్లు కేంద్రాలకు తరలించే సమయంలోనూ సమాధాన పత్రాలను తిరిగి తరలించే సమయంలోనూ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Read Also: Gas Cylinder Theft: ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది

పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరీక్షా కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు, పరీక్షలకు కేటాయించిన సిబ్బంది తప్ప ఇతరులు ఉండరాదని ఎస్పీ గారు స్పష్టం చేశారు. అలాగే పరీక్షల సమయంలో పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రతి పరీక్షా కేంద్రంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా పోలీస్ అధికారులు పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని ఆమె ఆదేశించారు.పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరగడానికి ఇతర శాఖల సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేశామని, మొబైల్ పెట్రోలింగ్ బృందాలు ఏర్పాటు చేయడంతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లు నిరంతరం పర్యవేక్షణ చేస్తాయని తెలిపారు.

Nellore: Tight security arrangements for class 10 exams: District SP
Nellore: Tight security arrangements for class 10 exams: District SP

పరీక్షల సమయంలో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఎస్పీ ఆల్ ది బెస్ట్ తెలిపారు. విద్యార్థులు పరీక్షా నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సమయానికి హాజరు కావాలని సూచించారు.జిల్లా వ్యాప్తంగా ఏ పరీక్షా కేంద్రం వద్ద అయినా ఎటువంటి చిన్న ఘటన జరిగిన వెంటనే 100 / 112 కు లేదా జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్ 9392903143 కు సమాచారం అందించాలని ఎస్పీ తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది
2:14

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

📢 For Advertisement Booking: 98481 12870