Nellore crime news: పాత కక్షలు మనసులో పెట్టుకుని అన్నదమ్ములపై దానికి పాల్పడిన ఏడుగురు నిందితులను నెల్లూరు రూరల్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు మైనర్లు ఉండడం గమనార్హం. ఈ సంఘటన వివరాలను రూరల్ డిఎస్పి ఘట్టమనేని శ్రీనివాసరావు బుధవారం రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు.. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోడూరుపాడు గ్రామానికి చెందిన ఈదురు సుశాంత్ పదో తరగతి చదువుతున్నాడు.
Read Also: MGNREGA: చట్టాన్ని మార్చడమంటే పేదల పొట్టకొట్టడమే: మీనాక్షి
ఈనెల 26వ తేదీ ఉదయం తన అన్న హర్షవర్ధన్ తో కలిసి సుశాంత్ ఇంటికి వెళుతుండగా కల్తీ కాలనీకి చెందిన కాసు మోహన్, కాసు కళ్యాణ్, బుచ్చిరెడ్డిపాలెం మండలం కొత్త మినగల్లు కు చెందిన కాకాని రాకేష్ అలియాస్ రాఖీ, కోడూరుపాడు గ్రామానికి చెందిన బోడెద్దుల శ్రీనివాసులు, కొలగట్ల ఉమ్మయ్య అలియాస్ ఉమ మరో ఇద్దరు మైనర్లు కలిసి అన్నదమ్ముల ఇద్దరిపై పాత కక్షలు మనసులో పెట్టుకుని మారణాయుధాలతో దాడి చేశారు. అడ్డు వచ్చిన వారిపై కూడా విచక్షణారహితంగాదాడి చేయబోవటంతో పాటు ఆ ప్రాంతంలో అలజడి సృష్టించారు.
చుట్టుపక్కల వారు సమీపానికి చేరుకునే లాగా అక్కడనుండి పరారీ అయ్యారు. బాధితుడు సుశాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్న నెల్లూరు(Nellore crime news) రూరల్ పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రూరల్ మండలం అశోక్ నగర్ సమీపంలో నిందితులను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి దానికి ఉపయోగించిన ఆయుధాలు, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన సీఐ గుంజి వేణు తో పాటు ఇతర స్టేషన్ సిబ్బందిని ఎస్పీ రివార్డుల కోసం సిఫార్సు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: