మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకులు కలిశారు. విమాన ప్రమాదంలో మరణించిన డిప్యూటీ సీఎం అజిత్ పవార్ పోర్ట్‌ఫోలియోలపై చర్చించారు. ఆయన నిర్వహించిన మంత్రి పదవులపై తమ పార్టీకే హక్కు ఉన్నదని తెలిపారు. శుక్రవారం ఎన్సీపీ సీనియర్ నేతలు (NCP leader)ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే, ఛగన్ భుజ్‌బల్ కలిసి సీఎం ఫడ్నవీస్ అధికార నివాసానికి వెళ్లారు. అజిత్ పవార్ నిర్వహించిన కీలకమైన ఆర్థిక, రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖలతో సహా అన్ని మంత్రిత్వ శాఖలు ఎన్సీపీ కోటాలోనే కొనసాగాలని కోరారు. ఈ మేరకు ఒక లేఖను సమర్పించారు. కాగా, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో సమావేశం తర్వాత ఎన్సీపీ (NCP leader)కీలక నేత ప్రఫుల్ పటేల్ మీడియాతో మాట్లాడారు. మహాయుతి కూటమి ప్రభుత్వంలో తాము భాగస్వాములని తెలిపారు.
Read Also: http://TMC vs BJP: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు: మమతకు ఆధిక్యమేనా?

అజిత్ పవార్ నిర్వహించిన పదవులను వీలైనంత త్వరగా భర్తీ చేయడానికి సరైన నిర్ణయం తీసుకోవాలని ఫడ్నవీస్‌ను కోరినట్లు చెప్పారు. మరోవైపు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు పార్టీతోపాటు ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నదని ప్రఫుల్ పటేల్ తెలిపారు. ‘దుఃఖం నుంచి కోలుకోవడానికి అజిత్ పవార్ కుటుంబానికి కొంత సమయం ఇవ్వాలి. మేం త్వరలోనే సునేత్ర పవార్, ఇతర కుటుంబ సభ్యులతో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తాం’ అని అన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: