हिन्दी | Epaper

Mudragada Padmanabham: అంబటి కుటుంబాని పరామర్శించిన ముద్రగడ

Saritha
Mudragada Padmanabham: అంబటి  కుటుంబాని పరామర్శించిన ముద్రగడ

Mudragada Padmanabham: వైసీపీ సీనియర్ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సోమవారం గుంటూరులో పర్యటించారు. ఇటీవల దాడికి గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) నివాసాన్ని సందర్శించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కూటమి పాలనలో వైసీపీ నేతలే లక్ష్యంగా దాడులు జరగడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఆయన మండిపడ్డారు. బాధితుడైన అంబటిపైనే కేసులు పెట్టడంపై ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ పర్యటనలో అంబటి రాంబాబు కుమార్తె మౌనిక ధైర్యాన్ని ముద్రగడ ప్రత్యేకంగా అభినందించారు. ఆమెను ‘ఫైర్‌బ్రాండ్’ అని అభివర్ణిస్తూ.. భవిష్యత్తులో ఆమె పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఆపద సమయంలో కుటుంబానికి అండగా నిలిచిన ఆమె తీరును ఆయన కొనియాడారు.

Read Also: Andhra Pradesh: రేపటికి వాయిదా పడ్డ ఏపీ శాసనమండలి

Mudragada Padmanabham: అంబటి  కుటుంబాని పరామర్శించిన ముద్రగడ
Mudragada Padmanabham: Mudragada visited Ambati’s family

చంద్రబాబుపై విమర్శలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ముద్రగడ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “కాపుల ఓట్లతో రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు, ఇప్పుడు అదే వర్గాన్ని వేధిస్తున్నారు. నాడు నా కుటుంబాన్ని అవమానించారు, ఇప్పుడు అంబటిని టార్గెట్ చేశారు. మాకు జరిగిన అవమానాలు మీ భార్య, కొడుకు, కోడలికి జరిగితే ఎలా ఉంటుందో ఆలోచించండి” అంటూ ఘాటుగా ప్రశ్నించారు. కాపులు ఎవరికీ బానిసలు కాదని, తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించబోమని హెచ్చరించారు.

లడ్డూ వివాదంపై స్పందన

తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో కూటమి ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తోందని ముద్రగడ విమర్శించారు. దేవుడి విషయంలో అబద్ధాలు ఆడటం మానుకోవాలని, శ్రీవారికి క్షమాపణ చెప్పాలని సూచించారు. కక్ష సాధింపు రాజకీయాలకు స్వస్తి పలికి, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని హితవు పలికారు. లేనిపక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ముద్రగడ హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870