हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Andhra Pradesh: గత ప్రభుత్వ హయాంలో మద్యం సొమ్ము కాజేసిన కృష్ణమోహన్‌రెడ్డి

Anusha
Andhra Pradesh: గత ప్రభుత్వ హయాంలో మద్యం సొమ్ము కాజేసిన కృష్ణమోహన్‌రెడ్డి

రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పులివెందుల ప్రాంతీయ అభివృద్ధి ప్రాధికార సంస్థ (పాడా)కు ఓఎస్‌డీగా పని చేసిన కృష్ణమోహన్‌రెడ్డి అప్పటి నుంచి వైఎస్ కుటుంబ వ్యక్తిగా మారిపోయారు. తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ చేసి జగన్‌ ఓఎస్‌డీగా చేరారు. కుమారుడి పేరుతో కంపెనీలు ఏర్పాటు చేసి మద్యం ముడుపులు సొమ్ము కాజేశారు.మాజీ సీఎం జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి తన కుమారుడు రోహిత్‌రెడ్డి డైరెక్టర్‌గా పలు కంపెనీలు ఏర్పాటు చేసి ముడుపులు కాజేశారని విచారణలో తేలింది. 2022 ఆగస్టులో నాటికల్‌ గ్రీన్‌ ఎనర్జీ అండ్‌ లాజిస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను 2021 మార్చిలో స్కూబీ ల్యాబ్స్‌ రోబోటిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(Scooby Labs Robotics Private Limited) స్థాపించారు. ఈ రెండు సంస్థలనూ జగన్‌ సీఎంగా ఉండగానే నెలకొల్పారు. ఐబాట్‌ ఎనర్జీ సిస్టమ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌(iBot Energy Systems India Private Limited)అనే మరో సంస్థకూ రోహిత్‌రెడ్డి డైరెక్టర్‌గా ఉన్నారు.

 Andhra Pradesh: గత ప్రభుత్వ హయాంలో మద్యం సొమ్ము కాజేసిన కృష్ణమోహన్‌రెడ్డి
Andhra Pradesh: గత ప్రభుత్వ హయాంలో మద్యం సొమ్ము కాజేసిన కృష్ణమోహన్‌రెడ్డి

ఆరోపణలు

మూడు సంస్థల ద్వారా మద్యం ముడుపులు సొమ్ము రూటింగ్‌ జరిగినట్లు సిట్‌(SIT) భావిస్తోంది. ఇవి కాకుండా క్రిస్టల్‌ మాన్‌సన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్, ఏక్యూ స్క్వేర్‌ రియల్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థల ద్వారా హైదరాబాద్‌లో స్థిరాస్తి రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు సిట్‌ గుర్తించింది. ఆ కంపెనీలకు కృష్ణమోహన్‌రెడ్డి(Krishnamohan Reddy) కుమారుడు రోహిత్‌రెడ్డికి మధ్య అనేక అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన సిట్‌ అధికారులు వీటిపై ఆరా తీస్తున్నారు.ఈ సంస్థల్లోకి ఎక్కడి నుంచి నిధులు వచ్చాయనే దానిపై దృష్టి సారించారు. గత ప్రభుత్వ హయాంలో షిర్డి సాయి ఎలక్ట్రికల్స్‌కు వేల కోట్ల విలువైన విద్యుత్‌ కాంట్రాక్టులు కట్టబెట్టారు. ఈ సంస్థతో కృష్ణమోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. షిర్డీసాయి తరపున అంతా తానై వ్యవహరించి వ్యవహారాలు చక్కబెట్టడంలో కీలకంగా వ్యవహరించారు. గతంలో ఆయన కుమారుడు షిర్డీ సాయిలో పని చేశారు. సీఎం ఓఎస్‌డీగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఉమ్మడి నెల్లూరు జిల్లా(Nellore District) మైనింగ్‌ రంగంలో కృష్ణమోహన్‌రెడ్డి చక్రం తిప్పారు. అక్కడి వ్యవహారాలన్నీ ఈయన కనుసన్నల్లోనే జరిగేవి. అప్పట్లో మంత్రిగా పనిచేసిన ఒకరు పెద్దమొత్తంలో వసూళ్లు చేసి ఈయనకు అందించారనే ఆరోపణలున్నాయి.కోవిడ్‌ సమయంలో విరాళాల్లోనూ ఓఎస్‌డీ చేతివాటం ప్రదర్శించారని చెబుతారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల, కాంట్రాక్టులు ఇప్పించడంలోనూ కీలకంగా వ్యవహరించి కమిషన్లు పొందారనే ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులకు అప్పటి సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డితో కలిసి కమిషన్లు తీసుకునే వారనే ఆరోపణలున్నాయి.

Read Also: Yoga Month: ఈ నెల 21 నుంచి జూన్‌ 21 వరకు యోగా నెల: సీఎం చంద్రబాబు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870