ఆంధ్రప్రదేశ్ అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రముఖ జర్నలిస్ట్,‘సాక్షి టీవీ’ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు కావడం రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఆయన ఇటీవల ఒక ఛానెల్‌లో ప్రసారం చేసిన టాక్ షోలో అమరావతి ప్రాంతానికి చెందిన మహిళలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ఆ వ్యాఖ్యలపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతుండగా, పలువురు మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఏపీ పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.అయితే, ఈరోజు ఉదయం వైద్య పరీక్షల కోసం ఆయనను గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను మంగళగిరి కోర్టులో హాజరుపరచనున్నారు.
కొనసాగించేందుకు
వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి, నాలుగు రోజుల క్రితం దాఖలైన ఫిర్యాదు మేరకు ఈ అరెస్ట్ జరిగింది. హైదరాబాద్‌లోని జర్నలిస్ట్స్ కాలనీలో ఉన్న ఆయన నివాసం నుంచి కొమ్మినేని శ్రీనివాసరావు(Kommineni Srinivasa Rao)ను అదుపులోకి తీసుకున్న అధికారులు, తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌కు తరలించారు.అమరావతిని “వేశ్యల రాజధాని” అంటూ జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కేఎస్ఆర్ లైవ్ షోలో ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలను యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు ఖండించకపోగా వాటిని కొనసాగించేందుకు మరింత ఊతమిచ్చారు. ముఖ్యంగా రాజధాని అభివృద్ధి కోసం తమ భూములను త్యాగం చేసిన మహిళలను ఈ వ్యాఖ్యలు తీవ్రంగా అవమానించేలా ఉన్నాయని పలువురు ఖండించారు.

యాజమాన్యంపైన
ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష(Kambhampati Sirisha) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు జర్నలిస్టు కృష్ణంరాజు, ‘సాక్షి టీవీ’ యాజమాన్యంపైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులపై ఎస్సీ/ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టంతో పాటు, భారతీయ న్యాయసంహితలోని ఇతర సంబంధిత సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. కాగా, కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఘటన మీడియా, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Read Also: Vidyarthi Mitra : ఏపీలో ‘విద్యార్థి మిత్ర కిట్’లు రెడీ.. 12 నుంచి పంపిణీ