ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రేపు పల్నాడు జిల్లా సత్తెనపల్లి (Sattenapalli) పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా, గత ఏడాది ఆత్మహత్యకు పాల్పడిన వైసీపీ సీనియర్ నాయకుడు నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం ఇప్పటికే రాజకీయంగా వేడి పుట్టించగా, పర్యటనకు ముందు రోజే జిల్లా రాజకీయాల్లో మార్పులకు దారి తీసే పరిణామాలు చోటు చేసుకున్నాయి.ఈ పర్యటన రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, జగన్ పర్యటనపై సత్తెనపల్లి టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) ఘాటుగా స్పందించారు.జగన్ ను నమ్మి ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఎంతో మంది సర్వనాశనమయ్యారని తీవ్రస్థాయిలో విమర్శించారు.
పెద్ద సంఖ్యలో
గుంటూరు జిల్లా సత్తెనపల్లి మున్సిపాలిటీకి చెందిన నలుగురు వైసీపీ కౌన్సిలర్లు నేడు టీడీపీలో చేరారు. జగన్ పల్నాడు (Palnadu) జిల్లా పర్యటనకు కేవలం ఒక రోజు ముందు వైసీపీకి చెందిన కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కన్నా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.”జగన్ ఇచ్చిన తప్పుడు సర్వే రిపోర్టుల కారణంగానే నాగమల్లేశ్వరరావు (Nagamalleshwara Rao) ఎన్నికల బెట్టింగ్‌లో ఏకంగా రూ.10 కోట్లు నష్టపోయారు.

అరాచకాలను
అప్పులు ఇచ్చిన వారి నుంచి తీవ్ర అవమానాలు ఎదురవడంతో, తట్టుకోలేక ఆయన 2024 జూన్ 9వ తేదీన ఆత్మహత్య చేసుకున్నారు. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఇప్పుడు జగన్ రావడం సిగ్గుచేటు” అని కన్నామండిపడ్డారు.జగన్ (Jagan) అరాచకాలను ప్రజలు భరించలేకపోయారని, అందుకే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పార్టీని చిత్తుచిత్తుగా ఓడించారని కన్నా గుర్తుచేశారు.
Read Also: Chevireddy: లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు