हिन्दी | Epaper

Crop Insurance: పంటల బీమా నిధుల్ని విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

Anusha
Crop Insurance: పంటల బీమా నిధుల్ని విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన వేళ  రైతన్నలకు శుభవార్త చెప్పింది. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పంటల బీమా నిధుల్ని విడుదల చేసింది. ఖరీఫ్ సాగుకు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వాటా అయిన 50 శాతం మొత్తాన్ని ముందస్తు ప్రీమియంగా చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన నిధులని ప్రభుత్వం విడుదల చేసింది. ఖరీఫ్ సీజన్‌(Kharif season) బీమా మొత్తానికి అవసరమైన రూ.132.58 కోట్ల నిధుల్ని విడుదల చేస్తూ కూటమి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల రైతులకు మేలు కలగనుంది. దీని వల్ల పంట బీమా పథకాలను సకాలంలో అందజేయడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుంది.

పథకాలు

రైతన్నలకు పంటల బీమా పథకం వల్ల మేలు కలగనుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం ఏర్పడితే వారిని ఆదుకునేందుకు సకాలంలో ఇన్ పుట్ సబ్సిడీ(Input subsidy) అందించేందుకు ఈ బీమా పథకాలు ఉపయోగపడతాయి. దీనిలో భాగంగానే కూటమి సర్కార్ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ముందస్తు ప్రీమియంలో తన వాటా మొత్తం చెల్లించేందుకు నిధులను విడుదల చేసింది. కేంద్రం వాటాతో కలిపి ఈ ప్రీమియాన్ని బీమా అందించే సంస్థలకు చెల్లిస్తారు. ఇవి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటుంది.

Crop Insurance: పంటల బీమా నిధుల్ని విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
Crop Insurance: పంటల బీమా నిధుల్ని విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

పెట్టుబడి

రైతులను ఆదుకునేందుకు వారికి పెట్టుబడి సాయం అందించేందుకు ముందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. ఇందుకోసం కూటమి సర్కార్ ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా రాష్ట్రంలోని చిన్న, సన్నకారు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం కింద నగదు జమ చేస్తారు. అన్నదాత సుఖీభవ(Annadaatha Sukhibava Scheme) కింద అర్హులైన ప్రతి రైతుకి ఏటా రూ. 20 వేలు అందించనున్నారు.ఈ మొత్తాన్నిమూడు విడతల్లో రైతు ఖాతాలో జమ చేస్తారు. అయితే ఈ 20 వేల రూపాయల్లో కేంద్రం పీఎంకిసాన్‌ కింద ఇచ్చే రూ. 6 వేలు కూడా కలిసి ఉంటాయి. కేంద్ర సాయాన్ని మినహాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రైతుకి ఏటా రూ.14 వేలు ఆర్థిక సాయం అందిస్తుంది. త్వరలోనే అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులని విడుదల చేయనున్నారు.

Read Also: AP IT: ఏపీలో క్వాంటం వ్యాలీ టెక్ పార్క్.. ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ సులభం

ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ సులభం

నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది రోజున ఏపీ జాబ్ క్యాలెండర్!

నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది రోజున ఏపీ జాబ్ క్యాలెండర్!

📢 For Advertisement Booking: 98481 12870