ఆంధ్రప్రదేశ్ లో రేషన్ పంపిణీ నేటి నుంచి(జూన్ 1) ప్రారంభం అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 29,796 రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీ చేయనున్నారు.అయితే ఏపీలో ఆదివారం నాడు కూడా రేషన్ సరుకుల పంపిణీ ఉంటుందని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు(Chief Minister Chandrababu Naidu) రేషన్ పంపిణీపై కీలక ప్రకటన చేశారు. ఇది ప్రజలకు శుభవార్త అనే చెప్పవచ్చు.చంద్రబాబు మాట్లాడుతూ ఎవరైనా రేషన్ సరుకులు వద్దనుకుంటే దానికి బదులుగా ఆమేరకు నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని వెల్లడించారు. నేటి నుంచి రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరకులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఒకవేళ ఎవరైన రేషన్ వద్దు అనుకుంటే దాని ద్వారా వచ్చే మొత్తాన్ని లెక్కగట్టి నగదు అందిస్తామని తెలిపారు. అయితే కిలో బియ్యానికి ఎంత డబ్బు వస్తుంది అనే విషయంపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా
ఇకపై రేషన్ షాపుల వద్దనే నిత్యవసర సరుకులను పంపిణీ చేస్తామని సీఎం ప్రకటించారు. నెలలో 15 రోజులు రేషన్ పంపిణీ ఉంటుందని,ప్రజలు తమకు వీలున్న సమయంలో వెళ్లి రేషన్ తీసుకోవచ్చని చెప్పుకొచ్చారు. అలానే వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే వెళ్లి రేషన్ సరుకులు అందిస్తామని తెలిపారు. జూన్ 1, ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 15 రోజుల పాటు రేషన్ షాపులు తీసే ఉంటాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అంతేకాక ప్రతి రోజు ఉదయం 8-12 గంటల వరకు అలానే సాయంత్రం 4-8 గంటల మధ్య మొత్తం రోజులో 8 గంటల పాటు రేషన్ షాపులు పని చేస్తాయని మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సందర్భంగా
గత ప్రభుత్వ హాయాంలో వాహనాలలో రేషన్ సరుకులు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసేవారు. కానీ కూటమి ప్రభుత్వం ఆ విధానాన్ని రద్దు చేసింది. లబ్దిదారులే రేషన్ దుకాణాలకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే దివ్యాంగులు, వృద్దులకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చింది. గత ప్రభుత్వంలోని రేషన్ పంపిణీ వ్యవస్థపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) విమర్శలు గుప్పించారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గతంలో ఇంటి వద్దకే రేషన్ సరుకులు పంపిస్తామని చెప్పి రూ.1600 కోట్ల భారీ ఖర్చుతో వాహనాలు కొనుగోలు చేసిందని చెప్పుకొచ్చారు. అయితే లబ్దిదారులందరికీ రేషన్ ఇవ్వలేదని నెలలో కేవలం ఒకటి రెండు రోజులు మాత్రమే జంక్షన్లలో వాహనాన్ని ఉంచి రేషన్ సరుకులు ఇచ్చినట్లు తెలిపారు. దీని వల్ల ఎంతో మంది పేదలు రేషన్ సరుకులు అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారని పవన్ కళ్యాణ్ తెలిపారు.
Read Also: Crop Insurance: పంటల బీమా నిధుల్ని విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం