हिन्दी | Epaper

Wall Collapse: సింహాచలం దుర్ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు

Anusha
Wall Collapse: సింహాచలం దుర్ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు

ఏపి విశాఖపట్నంలో సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో ఘోర విషాదం జరిగింది. స్వామివారి నిజ రూపాన్ని చూసేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలి ఏడుగురు చనిపోయారు. మరికొంతమంది భక్తులు గాయపడ్డారు. సింహాచలం బస్టాండ్ నుంచి పైకి వెళ్లే దారిలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర రూ.300 టికెట్ క్యూ లైన్ వద్ద మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం కురవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. శిథిలాల కింద మరికొందరు చాలా మంది చిక్కుకున్నారు. వెంటనే ఎన్ డిఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. గాయపడిన వారిని దగ్గరలోని ఆస్పత్రులకు ఈ ఘటనలో చనిపోయిన ఏడుగురు మృతదేహాలను విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు.

ప్రత్యేక పూజ

ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ‘శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందడం నన్ను కలచి వేసింది. భారీ వర్షాల కారణంగా గోడ కూలడం తో జరిగిన ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అక్కడి పరిస్థితి పై జిల్లా కలెక్టర్, ఎస్పీ తో మాట్లాడాను. గాయపడిన వారికి చికిత్స అందించాలని ఆదేశించాను. ఎప్పటికప్పుడు పరిస్థితి ని సమీక్షిస్తున్నాను’ అన్నారు.వరహా లక్ష్మీ నరసింహస్వామి నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా సింహగిరికి తరలి వచ్చారు.తెల్లవారుజామున ఒంటిగంటకు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. ఆ తర్వాత స్వామివారి దేహంపై ఉన్న చందనాన్ని తీసేశారు. నిజరూపంలోకి వచ్చిన స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, ఆయన కుటుంబ సభ్యులకు మొదటిగా నిజరూప దర్శనం కల్పించగా వారు స్వామివారికి తొలి చందనాన్ని సమర్పించారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ తరఫున కూడా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రోటోకాల్, అంతరాలయ దర్శనాలు ఏర్పాటు చేశారు.

దర్శనం

అప్పన్నస్వామి నిజరూప దర్శనం కోసం మంగళవాం మధ్యాహ్నం నుంచే సింహగిరికి భారీగా తరలివచ్చారు. కేశఖండనశాల ఎదురుగా ఉన్న కళ్యాణం మైదానంలో ఏర్పాటు చేసిన ఉచిత దర్శనం క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్లు దాటి త్రిపురాంతక స్వామి ఆలయం వరకు ఈ క్యూలైన్ ఉంది. ముందుగానే ఉచిత క్యూలైన్లలో చేరుకుంటే వేగంగా దర్శనం చేసుకోవచ్చనే ఉద్దేశంతో ముందురోజే తరలివచ్చారు.

Read Also: Simhadri Appanna : సింహాచలం ఆలయం వద్ద ఘోర ప్రమాదం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870