వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తిరుపతి నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (Chevireddy Bhaskar Reddy) ని బెంగళూరులోని విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై మద్యం కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో జారీ చేసిన లుకౌట్ నోటీసుల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

పక్కా సమాచారం
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద ఆయను అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. ఆయనను తదుపరి విచారణ నిమిత్తం విజయవాడ (Vijayawada) లోని సిట్ కార్యాలయానికి తరలించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: Vangalapudi Anitha: కుప్పంలో అమానుష ఘటనపై హోంమంత్రి స్పందన