ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే మరియు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ తీపికబురు చెప్పారు.ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవ కార్యక్రమం సందర్భంగా ఆయన ఆస్పత్రి గురించి, భవిష్యత్ ప్రణాళికల గురించి కీలక ప్రకటన చేశారు.పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ క్యాన్సర్ చికిత్స అందిస్తున్నామని బాలకృష్ణ తెలిపారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravathi) లో బసవతారకం వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి 110 పడకలతో మొదలైందని.. ఇప్పుడు 700 పడకలకు పైగా విస్తరించిందన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో లాభాపేక్ష లేకుండా అందరికీ చికిత్స అందిస్తున్నామన్నారు. తన తల్లిదండ్రులు తనకు జన్మనివ్వడమే కాకుండా మంచి లక్ష్యాన్ని కూడా ఇచ్చారన్నారు బాలయ్య.
లిఫ్ట్ ఆపరేటర్‌గా
వచ్చే ఏడాది ఇదే రోజున రజతోత్సవ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. దామోదర్ రాజనర్సింహ పేరుతో సినిమా తీద్దామనుకుంటున్నాను అని బాలకృష్ణ (Balakrishna) సరదాగా వ్యాఖ్యానించారు.బసవతారకం ఆస్పత్రిలో దివ్యాంగుడిని లిఫ్ట్ ఆపరేటర్‌గా చూసి సంతోషించానన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా ఇలాంటి అవకాశం కల్పించాలని సూచించారు. బాలకృష్ణను మొదట సినీ హీరోగా చూశానని కానీ మాట్లాడిన తర్వాత తన అభిప్రాయం మారిందని ఆయన ఒక గొప్ప లక్ష్యం కలిగిన వ్యక్తిని అని తనకు అర్థమైందన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రోగుల ప్రాణాలను కాపాడటంలో అద్భుతంగా పనిచేస్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఏటా దాదాపు 50-55 వేల మంది కొత్తగా క్యాన్సర్ బారిన పడుతున్నారన్నారు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ.

ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలతో ఏర్పాటు
త్వరలోనే అన్ని జిల్లాల్లో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని అధునాతన వైద్యసేవలు అందించేలా రీజినల్ క్యాన్సర్ కేర్ సెంటర్లను అందుబాటులోకి తెస్తామన్నారు.హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని బసవతారకం ఆసుపత్రిలో జరిగిన రజతోత్సవంలో దివంగత ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలతో ఏర్పాటు చేసిన పైలాన్‌ను బాలకృష్ణ ఆవిష్కరించారు. అనంతరం ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన లీనియర్ యాక్సిలేటర్ రేడియో థెరపీ యంత్రాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Varma) ప్రారంభించారు. గుండె సంబంధిత పరీక్షలు, చికిత్స కోసం ఏర్పాటు చేసిన క్యాథ్ ల్యాబ్‌ను మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు.
ఆస్పత్రి నిర్మాణానికి
క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి ఉపయోగించేందుకు ఈ లీనియర్ యాక్సిలేటర్ రేడియోథెరపీ అత్యాధునిక ఉపయోగపడుతుంది.క్యాథ్ ల్యాబ్ ద్వారా గుండె సంబంధిత సమస్యలను గుర్తించడానికి, వైద్యం అందించడానికి ఉపయోగిస్తారు.గతంలో టీడీపీ ప్రభుత్వం (2014-2019) అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి (Basavatarakam Cancer Hospital) నిర్మాణానికి భూమిని కేటాయించింది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఆ అడుగులు మందుకుపడలేదు. మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భూమి కేటాయింపుపై నిర్ణయం తీసుకుంది.. త్వరలోనే పనుల్ని ప్రారంభించాలని భావిస్తున్నారు.
Read Also: New Airport: ఏపీలో కొత్త ఎయిర్‌పోర్ట్‌లో ట్రయల్ రన్