हिन्दी | Epaper

AP HighCourt : కాకాణి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్‌

sumalatha chinthakayala
AP HighCourt : కాకాణి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్‌

AP HighCourt: మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. కేవలం రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేసినట్లు కాకాణి తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. అయితే, అధికారాన్ని అడ్డం పెట్టుకొని పలువురిని బెదిరించారని పోలీసుల తరఫు న్యాయవాది వివరించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.

కాకాణి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌

ప్రస్తుతం పరారీలోనే గోవర్ధన్‌రెడ్డి

వైసీపీ ప్రభుత్వ హయాంలో పొదలకూరు మండలంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి, అక్రమంగా క్వార్జ్‌ ఖనిజాన్ని తవ్వి తరలించారంటూ మైనింగ్‌ అధికారి బాలాజీ నాయక్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఫిబ్రవరి 16న పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు గోవర్ధన్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టం సెక్షన్లను కూడా కేసులో జోడించారు. ప్రస్తుతం గోవర్ధన్‌రెడ్డి పరారీలోనే ఉన్నారు. అతడి ఆచూకీ కోసం హైదరాబాద్‌లో నెల్లూరు పోలీసులు వెతుకుతున్నారు.

కాకాణి ఇప్పుడు మరింత చిక్కుల్లో కూరుకుపోయారు.

కాగా, అక్రమ మైనింగ్ కేసులో వరుసగా రెండు సార్లు పోలీసు విచారణకు డుమ్మా కొట్టిన కాకాణి ఇప్పుడు మరింత చిక్కుల్లో కూరుకుపోయారు. ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ ను విచారించిన ఏపీ హైకోర్టు ఆయనకు షాక్ ఇచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో పోలీసులు తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ ను హైకోర్టు మంగళవారం (ఏప్రిల్ 1) కొట్టివేసింది.

Read Also: అమరావతిలో గ్లోబల్‌ మెడ్‌సిటీ : సీఎం చంద్రబాబు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870