రాయలసీమ ప్రజల పౌరుషంపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఘాటుగా స్పందించారు. రాయలసీమకు పౌరుషం లేదని మాట్లాడటం దురహంకారమని అన్నారు. ఇలాంటి మాటలు చేస్తే రాయలసీమ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. తాను కూడా రాయలసీమ బిడ్డేనని, తనకు పౌరుషం ఉందని జేసీ స్పష్టం చేశారు.
Read also: Vijayawada: దుర్గమ్మ ఆలయ భక్తులకు కీలక ప్రకటన.. దర్శనాలు నిలిపివేత

కేతిరెడ్డి కుటుంబానికే పౌరుషం లేదని జేసీ తీవ్రంగా విమర్శించారు. ఐదేళ్లు అధికారంలో ఉండి ప్రజల ఉప్పు తిన్న కేతిరెడ్డి ధర్మవరంలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. గుడ్ మార్నింగ్ అంటూ షోలు చేయడం తప్ప ప్రజలకు చేసిన మేలు ఏమిటని ప్రశ్నించారు. మూడేళ్ల తర్వాత చూస్తామంటూ బెదిరింపులు చేస్తే అంగీకరించబోమని స్పష్టం చేశారు. దమ్ముంటే ఇప్పుడే బహిరంగ చర్చకు రావాలని జేసీ సవాల్ విసిరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: