ఏపీ (AP) లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. సుమారు ఏడు గంటల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయనను సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఆయన స్టేట్‌మెంట్‌ను ఈడీ రికార్డ్ చేసింది. ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా, ఈ మద్యం కుంభకోణం కేసులో కొందరు నిందితులు అరెస్టైన విషయం తెలిసిందే.
Read Also: AP Capital : రాజధాని నిర్మాణంలో భారీ దోపిడీ – జగన్
ఏపీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ
గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం లైసెన్సులు, డిస్ట్రిబ్యూషన్, విక్రయాల్లో భారీగా అవకతవకలు జరిగాయని, దీని ద్వారా సుమారు రూ. 3,500 కోట్లు చేతులు మారాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై సిట్ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో విజయసాయి రెడ్డి నిందితుడిగా ఉన్నారు.

ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న మరికొందరు నేతలు, మధ్యవర్తులపైనా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో ఏపీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: