నేషనల్ క్యాంపా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆనంద్ మోహన్
విజయవాడ : (AP) సముద్ర తీర ప్రాంతాల్లో క్షీణిస్తున్న మడ అడవులను పునరుద్ధరించి ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడమే మిస్ట్రీ పథకం ప్రధాన ఉద్దేశ్యం అని నేషనల్ క్యాంపా (సిఎఎంపిఎ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆనంద్ మోహన్ తెలిపారు. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ (Ministry of Forests), రాష్ట్ర అటవీ శాఖల సంయుక్తంగా తీరప్రాంత ఆవాసాలు, స్పష్టమైన ఆదా యాల కోసం మాంగ్రోవ్ ఇనీషియేటివ్ (మిస్ట్రీ) పై విజయవాడ లెమన్ ట్రీ ప్రీమియర్ లో గురువారం రెండు రోజులపాటు నిర్వహించే జాతీయ వర్కషాప్ను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన అనంతరం ఆనంద్ మోహన్ మాట్లాడుతూ.. సముద్ర తీరప్రాంతాల్లో క్షీణిస్తున్న మడ అడవులను రక్షించి, సముద్రం కోత నుంచి కాపాడటమే లక్ష్యంగా మిస్ట్రీ పథకం పనిచేస్తుందన్నారు.
Read also: CBN : లండన్లో నాపై నిఘా పెట్టారు ! చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

మిస్ట్రీ పథకం ద్వారా తీర ప్రాంత మడ అడవుల పునరుద్ధరణ
ప్రస్తుతం ఇది సుమారు రెండున్నర ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ పథకానికి జాతీయ కాంపా నిధుల నుండి 10శాతం కేటాయిస్తున్నారన్నారు. మొత్తం 825 కోట్ల రూపాయల కేటాయింపుల్లో ఇప్పటివరకు కేవలం రూ.100 కోట్లు వినియోగించబడ్డాయన్నారు. (AP) మడ అడవులు ప్రకృతి సిద్ధమైన రక్షణ గోడలా పనిచేసి తుపానులు, ఉప్పెనల వంటి ప్రకృతి తీరప్రాంతాలను అడవుల క్షీణత వల్ల భూగర్భ జలాల్లో ఉప్పునీరు చేరి వ్యవసాయ భూములు దెబ్బతింటున్నాయన్నారు. వీటిని కాపాడుకోవడం వల్ల స్థానిక రైతుల భూములు సురక్షితంగా ఉంటాయన్నారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ డాక్టర్ పివి చలపతిరావు స్వాగతోపన్యాసం చేస్తూ.. గత నాలుగు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్లో మడ అడవుల విస్తీర్ణం పెరుగుతూ ఉండటం ఒక సానుకూల అంశమని, భవిష్యత్తులో తీర ప్రాంతాన్ని మరింత సురక్షితంగా మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మడ అడవులను ఎలా అభివృద్ధి చేయాలి, తీర ప్రాంత రక్షణలో వాటి పాత్రపై లోతైన చర్చలు జరుగుతున్నాయన్నారు.
తీర ప్రాంత జీవనోపాధి, పర్యావరణ భద్రతకు మడ అడవుల ప్రాధాన్యం
పశ్చిమ బెంగాల్, గుజరాత్ తర్వాత, ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా మడ అడవులు ఉన్నాయన్నారు. మన రాష్ట్రంలో సుమారు 50వేల హెక్టార్లలో ఈ అడవులు ఉండగా, అందులో 40వేల హెక్టార్లు నోటిఫై చేయబడ్డా యన్నారు. మడ అడవులు తుఫానులు, సునామీలు, ఉప్పెనల నుండి ప్రాథమిక స్థాయి రక్షణగా నిలుస్తాయని, డెల్టా ప్రాంతాల్లోకి ఉప్పు నీరు చొచ్చుకు రాకుండా అడ్డుకుంటాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మిస్టీ పథకం ద్వారా మడ అడవుల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారని, 2028 వరకు ఈ పథకం కొనసాగుతుందన్నారు. రాష్ట్ర తీర ప్రాంతంలో దాదాపు 30శాతం కంటే ఎక్కువ భాగం కోతకు గురవుతోందని, దీనిని అరికట్టడానికి నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ (ఎన్స్స్సిఆర్) సహకారంతో మేనేజ్మెంట్ ప్లాన్స్ సిద్ధం చేస్తున్నారన్నారు. కృష్ణాగోదావరి డెల్టా ప్రాంతం ఆంధ్రప్రదేశకు అన్నపూర్ణ లాంటిదని, ఇక్కడ లభించే చేపలు, ఇతర వనరులు మన దేశానికి అవసరమైన ప్రోటీన్ కార్బోహెడేటను అంధిస్తాయన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: