1454 ఆస్పపత్రులకు ఎన్క్వాస్ నాణ్యతాప్రమాణాల ధ్రువీకరణ
సచివాలయం : (AP) ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యసేవల నాణ్యత పెంచేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఇందుకు నిదర్శనంగా ప్రాథమిక, సెకండరీ వైద్య సేవలందించే 1454 ఆస్పత్రులకు ప్రతిష్టాత్మకమైన కేంద్రప్రభుత్వ సంస్థ ఎన్క్వాస్ (నేషనల్ క్వాలిటీ అసెస్మెంట్ స్టాండర్డ్స్) సర్టిఫికేట్లు లభించినట్లు వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Satyakumar Yadav) వెల్లడించారు. సాధారణంగా నాణ్యతా ప్రమాణాల మేరకు కార్పొరేట్ ఆస్పత్రులకు లభించే ఈ స్థాయిలో రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులకు లభించడం హర్షణీయమన్నారు. గతేడాది జూన్లో అధికారంలోనికి వచ్చిన కూటమి ప్రభుత్వం అప్పటి నుండి వైద్య సేవల నాణ్యతను పెంచడానికి చేసిన ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి లభించిన గుర్తింపు అని మంత్రి అన్నారు.
Read Also: Andhra Pradesh: నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం

జిల్లాలవారీగా ముందంజలో ఉన్న ఆస్పత్రులు
138 ప్రభుత్వాసుపత్రులకు ఎన్క్వాస్ సర్టిఫికెట్లు పొంది రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. 122కి సర్టిఫికెట్లు పొంది వైఎస్సార్ కడప జిల్లా ద్వితీయస్థానంలో, 118కి సర్టిఫికేట్లు పొంది ఏలూరు జిల్లా తృతీయ స్థానంలో నిలిచాయి. (AP) గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ళ పాలనలో 665 ఆస్పత్రులకు మాత్రమే గుర్తింపు దక్కింది. ఎన్క్వాస్ గుర్తింపు పొందిన ప్రభుత్వాసుపత్రులకు కేంద్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలకు ఏడాదికి రూ.1.26 లక్షలు చొప్పున మూడేళ్ళపాటు ఇస్తుంది. అలాగే ప్రాధమకి ఆరోగ్య కేంద్రాలకు రూ.3 లక్షల చొప్పున, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రూ.2 లక్షల చొప్పున, సెకండరీ హెల్త్ పరిధిలోని ఆస్పత్రులకు బెడ్కు రూ.10,000ల చొప్పున మూడేళ్ళపాటు ప్రోత్సాహకాలు అందజేస్తారన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: