हिन्दी | Epaper
పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

AP : ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం

Pooja
AP : ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం

విజయవాడ : ఏపీ ప్రభుత్వ(AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. 2026- 27 నీటి సంవత్స రానికి రాష్ట్ర నీటి బడ్జెట్ సిద్ధమైంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో జలవనరులశాఖ తొలిసారి ఈ నీటి బడ్జెట్ను తయారు చేసింది. ఈ మేరకు వచ్చే నీటి సంవత్సరంలో నీటిలభ్యతను 15 వందల 65 టీఎంసీలుగా, అవసరాలను 14 వందల 90 టీఎంసీలుగా అంచనాలు రూపొం దించారు. రైల్వే, వ్యవసాయ రంగాలకు ప్రత్యేక బడ్జెట్ తరహాలో రాష్ట్ర ప్రభు త్వం సరికొత్తగా నీటి బడ్జెట్కు శ్రీకారం చుడుతోంది. ఈ ఏడాది జూన్ 1 నుంచి వచ్చే ఏడాది మే 31 వరకు నీటి అవసరాలు, లభ్యత వంటి లెక్కలతో బడ్జెట్ లెక్కలు వేశారు. అసలు నీటిలభ్యతను ఎలా లెక్క కడతారనే సందేహాలు రావడం సహజమే. సాధారణంగా జిల్లాల్లో నీటి అభివృద్ధి మండలి సమావేశాల సమయం లో నదీ బోర్డుల్లో ముందే నీటి అంచనాలు లెక్కిస్తారు.

Read also: AP: రేపు మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు భేటీ

AP
AP Government: The government is preparing a special water budget.

పాత సంవత్సరాల్లో నీటి లభ్యత సరళి ఆధారంగా లెక్కలు కడతారు. ఈ అంచనాలు ఒక్కోసారి సరిపోవచ్చు, తప్పనూవచ్చు. వాతావరణ పరిస్థితులనూ అంచనాలోకి తీసు కుంటారు. ఆ రకంగా లెక్కించి రాష్ట్రంలోని నదుల్లో వచ్చే నీటి సంవత్సరంలో 15 వందల 65 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని లెక్కలు వేశారు. అన్నీ పోనూ 2027 రబీ ముగిసే సమయానికి 75 టీఎంసీల మిగులు జలాలు ఉంటాయనేది జలవనరులశాఖ ప్రస్తుతం లెక్క వేస్తుంది. రాష్ట్రంలో భారీ, మధ్య, చిన్న తరహా, APSIDC కింద నీటి లభ్యత ఉన్న ఆయకట్టు 106 లక్షల 54 వేల ఎకరాలు ఉంది. 202627 ఖరీఫ్ సాగుకు భారీ, మధ్య తరహా కింద ప్రతిపాదన 62 లక్షల 15 వేల ఎకరాలు కాగా, ఖరీఫ్ నీటి డిమాండ్ 760 టీఎంసీలుగా లెక్కలు కట్టారు.

రబీ ఆయకట్టు ప్రతిపాదన 26 లక్షల 77 వేల ఎకరాలు కాగా రబీ నీటి అవసరాలు 343 టీఎంసీలుగా అంచనా వేశారు. అటు చిన్న నీటి వనరుల(AP Government) కింద ఆయకట్టు ఖరీఫ్ ప్రతిపాదన 12 లక్షల 50 వేల ఎకరాలుగా, వీటికి నీటి డిమాండ్ 155 టీఎంసీలుగా లెక్క వేశారు. APSIDC పథకాల కింద ఖరీఫ్ ఆయకట్టు ప్రతిపాదన 6లక్షల 77వేల ఎకరాలుగా, నీటి అవసరాలు 47 టీఎంసీలుగా అంచనా కట్టారు. తాగునీటి అవసరాలు 157 టీఎంసీలు, పరిశ్రమలకు 28 టీఎంసీలుగా లెక్కలు వేశారు. మొత్తం నీటి అవసరాలు 14 వందల 90 టీఎంసీలుగా అంచనా వేస్తున్నారు. తాగునీటి అవసరాలు 157 టీఎంసీలు, పరిశ్ర మలకు 28 టీఎంసీలుగా లెక్కలు వేశారు. మొత్తం నీటి అవసరాలు 14 వందల 90 టీఎంసీలుగా అంచనా వేస్తున్నారు.

గడిచిన ఐదేళ్లలో సగటున రాష్ట్రంలో అన్ని వనరుల నుంచీ కలిపి 2 వేల 308 టీఎంసీల నీటిలభ్యతఉంది. భారీ జలాశయాల్లో 18 వందల 15 టీఎంసీలు, మధ్యతరహా జలాశ యాల్లో 493 టీఎంసీల లభ్యతఉంది. ఆ లెక్కన వచ్చే నీటి సంవత్సరంలో 15 వందల 65 టీఎంసీల లభ్యతను జలవనరులశాఖ అంచనా వేసింది. అవసరాలకు సరిపడా నీరు అందుబాటులో ఉండటమే కాకుండామిగులు కూడా ఉంటుందనేది వారిలెక్క. ఆ లెక్కలకు మరిన్ని తుది మెరుగులు దిద్దుతున్నారు. జనవరి 1 నాటికి 504 టీఎంసీలు: ప్రస్తుత నీటి సంవత్సరంలో 2026 జనవరి 1 నాటికి 504 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. భారీ నీటిపారుదల ప్రాజెక్టుల్లో 475 టీఎంసీలు, మధ్యతరహా ప్రాజెక్టుల్లో 29 టీఎంసీలు ఉన్నాయి.

రాష్ట్రంలోని అన్ని జలాశయాల మొత్తం నీటి నిల్వ సామర్థం 11 వందల 6 టీఎంసీలు. ఈ రిజర్వాయర్లలో వినియోగించుకునేందుకు నిల్వ చేయదగ్గ నీరు 846 టీఎంసీలు కాగా మిగిలిన నీళ్లు డెడ్ స్టోరేజీ కింద లెక అవుతుంది. ఈ మే నెలాఖరు వరకు రాష్ట్రంలో 412 టీఎంసీల నీటి అవసరాలు ఉంటాయన్నది అధికారుల అంచనా. రబీ సాగుకు 318 టీఎంసీలు, పరిశ్రమలకు 17 టీఎంసీలు, తాగునీటి అవసరాలకు 77 టీఎంసీలు అవసరమవుతాయి. అన్నీ పోను వచ్చే నీటి సంవత్సరం ప్రారంభం నాటికి 133 టీఎంసీలు వినియోగానికి అందుబాటులో ఉంటాయి. పులిచింతలలో ఉన్న 41 టీఎంసీలను కలిపి ఈ లెక్కలు వేశారు. వచ్చే ఖరీఫ్ ముందుగా ప్రారం భించేందుకు వీలవుతుందని అంచనా వేస్తున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870