हिन्दी | Epaper

AP: స్కూల్ పిల్లలకు ఉచితంగా ఆధార్ క్యాంపులు

Saritha
AP: స్కూల్ పిల్లలకు ఉచితంగా ఆధార్ క్యాంపులు

ఆంధ్రప్రదేశ్‌లో (AP) స్కూల్, కాలేజీ విద్యార్థులకు ప్రభుత్వం మరోసారి తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా మరోసారి స్కూల్స్, ఇంటర్ కాలేజీల్లో ఆధార్ (Aadhaar) స్పెషల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. గతేడాది నుంచి ఈ క్యాంపులు నిర్వహిస్తున్నా సరే చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల ఆధార్ కార్డులో వివరాలను అప్డేట్ చేయలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం మరోసారి క్యాంపులు నిర్వహిస్తోంది. ఈ నెల 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ ఆధార్ క్యాంపుల్ని స్కూల్స్, కాలేజీల్లో నిర్వహిస్తున్నారు. రెండో విడతగా ఈ నెల 16వ తేదీ నుంచి 20 తేదీ వరకు కూడా మరోసారి అవకాశం కల్పించారు.

Read Also: TG: ఎన్నికల వేళ విద్యార్థులకు వరుసగా 3 రోజులు సెలవు..?

AP: స్కూల్ పిల్లలకు ఉచితంగా ఆధార్ క్యాంపులు
AP Free Aadhaar camps for school children

ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే ఇబ్బందులు

ఈ ఆధార్ స్పెషల్ క్యాంపుల్ని నిర్వహిస్తున్నారు. (AP) ఐదేళ్ల నుంచి 17 ఏళ్ల వరకు పిల్లలకు ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత మొదటిసారి బయోమెట్రిక్ అప్డేట్ చేస్తే ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు.. పూర్తిగా ఉచితం. పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, మిగిలిన మార్పులు/చేర్పులకు కేంద్రం నిర్ణయించిన నామమాత్రంగా ఫీజులు వసూలు చేస్తారు. 

గతేడాది అక్టోబర్ నుంచి ఈ స్పెషల్ ఆధార్ క్యాంపుల్ని నిర్వహిస్తోంది. ప్రతి నెలలో రెండు విడతలుగా క్యాంపులు ఏర్పాటు చేసినా సరే చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల ఆధార్ కార్డుల్ని అప్డేట్ చేయడం లేదు అందుకే ప్రభుత్వం మరో ఛాన్స్ ఇచ్చింది. ఒకవేళ ఆధార్ కార్డు వివరాలు అప్డేట్ చేసుకోకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి అంటున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870