हिन्दी | Epaper

AP 10th Exams 2026: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. నిమిషం నిబంధన రద్దు!

Pooja
AP 10th Exams 2026: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. నిమిషం నిబంధన రద్దు!

AP 10th Exams 2026: ఏపీలో టెన్త్ విద్యార్థులకు ఊరట, ఒక నిమిషం ఆలస్యం నిబంధనను ప్రభుత్వం రద్దు చేసింది. పదో తరగతి పరీక్షలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 16వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, వీరి కోసం 3,415 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్, ఉచిత బస్సు ప్రయాణం, నిమిషం నిబంధన సడలింపు వంటివి వీటిలో ప్రధానమైనవి. పట్టణ, నగర ప్రాంతాల్లోని విద్యార్థులు పరీక్షా కేంద్రాలను గుర్తించడంలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు, ఈసారి హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించారు.

Read Also :Telangana: ఉమ్మడి పుల్కల్ మండలంలో టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం

AP 10th Exams 2026
AP 10th Exams 2026: Good News for 10th Grade Students—’One-Minute Rule’ Abolished!

మొబైల్ ఫోన్తో ఈ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా గూగుల్ మ్యాప్స్ సహాయంతో సులభంగా సెంటర్కు చేరుకోవచ్చు. అంతేకాకుండా విద్యార్థులు తమ హాల్ టికెట్ను చూపించి ఆర్టీసీ బస్సుల్లో పరీక్షా కేంద్రానికి, తిరిగి ఇంటికి ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఈ సౌకర్యం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగపడనుంది. ప్రతి రోజూ ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. విద్యార్థులను ఉదయం 8:30 గంటల నుంచే పరీక్షా కేంద్ర ప్రాంగణంలోకి అనుమతిస్తారు. ఈ ఏడాది విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఖినిమిషం నిబంధనఖిను కూడా సడలించారు. ప్రత్యేక పరిస్థితుల్లో పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత కూడా విద్యార్థులను అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులకు సన్నద్ధమయ్యేందుకు వీలుగా రెండు పరీక్షల మధ్య సెలవులు ఉండేలా టైం టేబుల్ను రూపొందించారు. పరీక్షల నిర్వహణతో పాటే జవాబు పత్రాల మూల్యాంకనానికి కూడా అధికారులు పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతుంది. ఇందుకోసం 26 జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి మార్కుల లెక్కింపులో పొరపాట్లకు తావివ్వకుండా ఉండేందుకు, ట్యాబ్లెట్లలో మార్కులను నమోదు చేసే నూతన విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఒక్కో ఉపాధ్యాయుడు రోజుకు 40 జవాబు పత్రాలను మాత్రమే మూల్యాంకనం చేసేలా నిబంధన విధించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870