ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర మంత్రిమండలి సమావేశం నేడు (గురువారం) సచివాలయంలో జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ కీలక సమావేశం జరగనుంది.. రాష్ట్ర అభివృద్ధి, రాజధాని అమరావతి పునర్నిర్మాణం, పెట్టుబడుల ఆకర్షణ, భూ కేటాయింపులు వంటి పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Read Also: AP: మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం

112 ఫ్లాట్ల మార్పులకు ఆమోదం
ఇటీవల సీఆర్డీఏ అథారిటీ ఆమోదించిన పలు ప్రతిపాదనలకు (Andhra Pradesh) కేబినెట్ అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కృష్ణా నది తీరంలో మెరినా వాటర్‌ఫ్రంట్ అభివృద్ధికి భూ కేటాయింపులు, రాజధానిలో 112 ఫ్లాట్ల మార్పులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే ఎస్‌ఐపీబీలో ఆమోదించిన 14 సంస్థల రూ.19,391 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలకు, పలు భూ కేటాయింపులకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: