हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Andhra Pradesh: ఆలయ అధికారులపై అనంతబాబు దూషణలు

Anusha
Andhra Pradesh: ఆలయ అధికారులపై అనంతబాబు దూషణలు

ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మరో వివాదంలో చిక్కుకున్నారు.స్వామివారి కళ్యాణం తర్వాత అక్షింతలు ఆలస్యం కావడంతో రెచ్చిపోయారు. ఏకంగా ఆలయ అధికారులపై దుర్భాషలాడారు. ‘వాడెవడు వాడి పెత్తనం ఏమిటిక్కడ?’ అంటూ కామెంట్స్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుండగా అనంతబాబు ప్రవర్తనపై విమర్శలు వస్తున్నాయి. అన్నవరం సత్యదేవుని ఆలయంలో గురువారం స్వామివారి కళ్యాణం ముగిసిన అనంతరం అక్షింతలు ఆలస్యమవడంతో అనంతబాబు ఆలయ అధికారులపై ఇలా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.తనకు తగిన గౌరవం ఇవ్వలేదంటూ హడావుడి చేశారట. అక్షింతలు ఇవ్వలేదని కళ్యాణ వేదిక వద్దే ఉండిపోయారని సమాచారం. ముఖ్యఅతిథులు వెళ్లిపోయినా అక్కడే ఉండి తనకు అక్షింతలు ఇవ్వాలని పట్టుబట్టారట.పరిస్థితిని చక్కదిద్దేందుకు ఈవో సుబ్బారావు, ఎమ్మెల్సీ అనంతబాబు చేతులు పట్టుకుని ఆయనను శాంతింపజేయడానికి ప్రయత్నించారు. కొంతసేపు అక్కడ ఈ వ్యవహారంపై చర్చ జరిగిన అనంతరం ఎమ్మెల్సీ అనంతబాబు(Ananth Babu) అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన ఆలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఈ సమయంలోనే ఆలయ పీఆర్ఓ‌ను ‘వాడెవడు వాడి పెత్తనం ఏంటి ఇక్కడ’ అంటూ దూషణలకు పాల్పడి అక్కడినుంచి వెళ్లిపోయారు. అనంతబాబు అనుచరులు సైతం ఓవరాక్షన్, వెధవ వేషాలు అంటూ దూషించారు. ఈ వీడియో వైరల్ కావడంతో అనంతబాబు తీరును భక్తులు తప్పుబడుతున్నారు. 

 Andhra Pradesh: ఆలయ అధికారులపై అనంతబాబు దూషణలు
Andhra Pradesh: అనంతబాబు దూషణలు

ప్రభుత్వం

అనంతబాబు ,సుబ్రహ్మణ్యాన్ని చంపిన (కాకినాడలో 2022 మే 19న సుబ్రహ్మణ్యం హత్య జరిగింది. కేసులో ఆరోపణలపై అరెస్టై జైలకు వెళ్లి మధ్యంతర బెయిల్‌పై వచ్చారు. ఇటీవల ఈ కేసు విచారణకు సంబంధించి ప్రాసిక్యూషన్‌కు సహకరించేందుకు రాజమహేంద్రవరానికి చెందిన న్యాయవాది, పౌరహక్కుల నేత ముప్పాళ్ల సుబ్బారావును ప్రత్యేక న్యాయవాదిగా(Special Advocate)నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆ తర్వాత అనంతబాబు ఓ వీడియో వివాదంలో కూడా చిక్కుకున్నారు.తాజాగా అన్నవరం ఆలయంలో జరిగిన ఘటనతో ఎమ్మెల్సీ అనంతబాబు తీరు చర్చనీయాంశమైంది.

Read Also : Andhra Pradesh: ఏపీలో కొత్తగా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఎక్కడంటే?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870