విజయవాడలో ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తిరాజు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అయోధ్యనగర్ క్షత్రియభవన్‌లో ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తిరాజు ఆత్మహత్య చేసుకున్నారు, ఆదిత్య ఫార్మసీ ఎండీ ఆత్మహత్య విషయమై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. నరసింహమూర్తిరాజు (Narasimha Murthy Raju) ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనాస్థలిలోనే ఓ లేఖను కూడా పోలీసులు గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు నరసింహమూర్తిరాజు ఇటీవల బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చారు.స్నేహితుడి హత్య కేసులో ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తిరాజును గతేడాది పోలీసులు అరెస్ట్ చేశారు.

విషయంపై సమాచారం అందుకున్న అతని భార్య
ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆయన, జైలు (Jail) నుంచి ఇటీవలే బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే ఈలోపే బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటనే దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు నరసింహరాజుమూర్తి ఆత్మహత్య విషయంపై సమాచారం అందుకున్న అతని భార్య హైదరాబాద్ (Hyderabad) నుంచి వెంటనే విజయవాడకు చేరుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Breaking News: పని గంటలలో తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు