हिन्दी | Epaper

Anakapalli: పరవాడ ఫార్మాసిటీ కంపెనీలో గ్యాస్ లీక్

Anusha
Anakapalli: పరవాడ ఫార్మాసిటీ కంపెనీలో గ్యాస్ లీక్

ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి(Anakapalli) జిల్లా పారిశ్రామిక ప్రాంతమైన పరవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరోసారి విషాదం చోటుచేసుకుంది.ఎస్ఎస్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు చనిపోగా ఒకరు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అతడ్ని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన వారిని పరిమి చంద్రశేఖర్ (సేఫ్టీ మేనేజర్ – తెలంగాణ), సరగడం కుమార్‌ (సేఫ్టీ ఆఫీసర్ – మునగపాక, అనకాపల్లి)గా గుర్తించారు. బైడూ భైసాల్ (ఒడిశా) అనే కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.పరవాడ ఫార్మాసిటీ(Paravada Pharmacity)లోని ఎస్ఎస్ (సాయి శ్రేయస్) ఫార్మా కంపెనీలో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.

 Anakapalli: పరవాడ ఫార్మాసిటీ కంపెనీలో గ్యాస్ లీక్
Anakapalli

అస్వస్థత

కంపెనీలో ఉన్న రసాయన వ్యర్థాల ట్రీట్‌మెంట్ ప్లాంట్ దగ్గర లెవల్స్‌ చెక్ చేయడానికి ముగ్గురు ఉద్యోగులు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ విడుదలైన రసాయన విషవాయువులను పీల్చడంతో ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా, ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటన గురించి సమాచారం రాగానే పరవాడ సీఐ, పోలీస్ సిబ్బంది ప్రమాద స్థలానికి వెళ్లారు. చనిపోయిన ఇద్దరు మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: Talliki Vandanam Scheme : తల్లికి వందనంలో చేతికందేది 2వేలే

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ సులభం

ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ సులభం

నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది రోజున ఏపీ జాబ్ క్యాలెండర్!

నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది రోజున ఏపీ జాబ్ క్యాలెండర్!

మహిళల జోలికొస్తే ఖబడ్డార్.. నేరగాళ్లపై డ్రోన్ నిఘా!

మహిళల జోలికొస్తే ఖబడ్డార్.. నేరగాళ్లపై డ్రోన్ నిఘా!

ఆరు నెలల్లో స్థానిక ఎన్నికలు: మంత్రులకు సీఎం చంద్రబాబు క్లారిటీ!

ఆరు నెలల్లో స్థానిక ఎన్నికలు: మంత్రులకు సీఎం చంద్రబాబు క్లారిటీ!

పెద్ద దిక్కును కోల్పోయిన జర్జంగి

పెద్ద దిక్కును కోల్పోయిన జర్జంగి

బీసీ రక్షణ చట్టంపై నేడు కీలక సమావేశం

బీసీ రక్షణ చట్టంపై నేడు కీలక సమావేశం

📢 For Advertisement Booking: 98481 12870