గత వారం అహమ్మదాబాద్(Ahmedabad) విమానాశ్రయంలో జరిగిన ఎయిర్ ఇండియా(Air India) ఘోర విమాన ప్రమాదం తర్వాత ప్రయాణికులు జర్నీ అంటేనే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశీయ, అంతర్జాతీయ(National, International) మార్గాల్లో ఎయిర్ ఇండియా విమానాల బుకింగ్‌లు దాదాపు 20 శాతం మేర తగ్గాయి. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (IATO) అధ్యక్షుడు రవి గోసైన్ ఈ కీలక వివరాలను వెల్లడించారు. ప్రమాదం తర్వాత ఎయిర్‌లైన్ సగటు ఛార్జీలు కూడా ఎనిమిది నుండి 15 శాతం తగ్గాయని ఆయన అన్నారు. అయినప్పటికీ బుకింగ్స్ ఏ మాత్రం పెరగలేదని చెప్పుకొచ్చారు. ప్రయాణికులు విమానాల జర్నీపై అంతగా ఆసక్తి చూపడం లేదని తెలిపారు. ఈ విమాన ప్రమాదం తర్వాత విదేశాలకు వెళ్లే ప్రయాణికుల్లో తగ్గుదల కనిపించింది. ఎందుకుంటే వారు బుకింగ్ చేసుకునేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు.

అంతర్జాతీయ బుకింగ్‌లు దాదాపు 18-22 శాతం తగ్గాయి
దీంతో అంతర్జాతీయ బుకింగ్‌లు దాదాపు 18-22 శాతం, దేశీయ బుకింగ్‌లు 10-12 శాతం తగ్గాయని చెబుతున్నారు. అయితే భవిష్యత్తులో పరిస్థితుల్లో మార్పులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది తాత్కాలికమేనని ఫీచర్లో బుకింగ్ లు పెరుగుతాయని విశ్వసిస్తున్నామని, పరిస్థితులు చక్కబడతాయని భావిస్తున్నామని గోసైన్ తెలిపారు. కీలకమైన ఎయిర్ ఇండియా రూట్లలో ఛార్జీలు కూడా సర్దుబాటు చేశామని చెప్పుకొచ్చారు.
ఛార్జీల తగ్గింపు
దేశీయ రంగాలలో టికెట్ ధరలు సగటున ఎనిమిది నుండి 12 శాతం తగ్గాయన్నారు. ఇండిగో, అకాసా వంటి బడ్జెట్ క్యారియర్‌లతో ఎయిర్ ఇండియా నేరుగా పోటీ పడుతుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ మార్గాల విషయానికి వస్తే.. యూరప్, ఆగ్నేయాసియాకు ఛార్జీలు 10-15 శాతం తగ్గాయని ఆయన అన్నారు. అయినా బుకింగ్ పెరుగుదల కనపడటం లేదని తెలిపారు. గత వారంలో అంతర్జాతీయంగా ప్రయాణాన్ని రద్దు చేసుకున్న వారి 15-18 శాతం పెరిగిందని తెలిపారు. దేశీయంగా ఎనిమిది నుండి 10 శాతం ఈ సంఖ్య పెరిగిందని తెలిపారు.
ఎటువంటి భద్రతా సమస్యలు లేదు
అయిన్పటికే రీబోయే రోజుల్లో బుకింగ్ లు మరింతగా పెరుగుతాయన్నారు. ఎయిర్ ఇండియా విమానంలో వ్యవస్థాపరంగా ఎటువంటి భద్రతా సమస్యలు లేదని..ఈ విషయాన్ని DGCA అధికారులు తెలిపారన్నారు. ఎయిర్ ఇండియా అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిర్ధారించారని చెప్పుకొచ్చారు. ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ కాంప్‌బెల్ విల్సన్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు భరోసా ఇచ్చారు.
ప్రజలలో విమానయానం పట్ల భయం పెరిగింది
అన్ని ఎయిర్ ఇండియా విమానాలు, ముఖ్యంగా బోయింగ్ 787, ఎగరడానికి సురక్షితంగా ఉన్నాయన్నారు. ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానాలపై ముందు జాగ్రత్తగా తనిఖీలను పూర్తి చేసాము. ఈ విమానం అవసరమైన అన్ని భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నట్లు DGCA బహిరంగంగా ప్రకటించింది. అయినప్పటికీ కూడా దర్యాప్తు తర్వాత ఎయిర్ ఇండియా విమానాలను ముందు జాగ్రత్త చర్యగా బయలు దేరే ముందు అన్ని తనిఖీలను కొనసాగిస్తుందని తెలిపారు.గత వారం జూన్ 12న.. 242 మంది ప్రయాణికులు, ఎయిర్ ఇండియా సిబ్బందితో లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా AI-171 విమానం అహ్మదాబాద్‌లో కూలిపోయింది. మేఘనానిగర్ ప్రాంతంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ విమానం మెడికల్ కాలేజీ క్యాంపస్‌లోకి దూసుకుపోయింది. విమానంలో ఉన్న ఒకరు తప్ప అందరూ ప్రమాదంలో మరణించగా.. క్యాంపస్‌లోకి దూసుకెళ్లడంతో మెడికోలు 29 మంది కూడా మరణించారు. ఈ ప్రమాదం వలన ప్రజలలో విమానయానం పట్ల భయం పెరిగింది. ఎయిర్‌లైన్‌పై నమ్మకం తిరిగి వచ్చేందుకు కొన్ని వారాల నుంచి నెలలు పట్టే అవకాశం ఉంది. టూరిజం మరియు విమానయాన రంగాల్లో ఇది తాత్కాలిక వెనుకడుగు కావొచ్చు. కానీ సంస్థలు భద్రతాపరమైన విశ్వాసాన్ని కలిగిస్తే మరియు ప్రయాణాల పట్ల ప్రయాణికులలో భరోసా పెంచితే మళ్లీ స్థిర స్థితికి వచ్చే అవకాశం ఉంది.
Read Also: cosmetic surgery : టర్కీలో కాస్మెటిక్ సర్జరీ వికటించి మొజాంబిక్ గాయని, మృతి