పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న భారీ చిత్రం కుబేరా (Kuberaa)ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల(Shekhar Kammula) ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ సినిమా మొదటి నుంచి ఎంతో క్రేజ్‌ను సొంతం చేసుకుంది. శేఖర్ కమ్ముల తరహాలో సున్నితమైన భావోద్వేగాలతో కూడిన కథతో వస్తుందా లేక కొత్త జోనర్ లో సోషల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుందా అన్న చర్చలు ఇండస్ట్రీలో నడుస్తున్నాయి. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా వంటి విభిన్న నటనకు పేరుగాంచిన నటులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతుండటంతో ఈ చిత్రం పట్ల అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
ప్రమోషన్స్
తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మల్టీ లింగ్వెల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్(Amigos Creations Private Limited) బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 20, 2025న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్రయూనిట్.ఇందులో భాగంగానే నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో పాటు ట్రైలర్ లాంఛ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ క్రమంలోనే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం జరుగడంతో 241 మంది మరణించారు. దీంతో వారికి నివాళులు అర్పిస్తూ ప్రీ రిలీజ్ వేడుకను వాయిదా వేసుకుంది చిత్రయూనిట్. త్వరలోనే కొత్త తేదీతో ముందుకు రాబోతున్నట్లు ప్రకటించింది.
Read Also: Ace Movie: ఓటీటీలోకి ‘ఏస్’ సినిమా