हिन्दी | Epaper

Raghav chadha bank charges : మినిమం బ్యాలెన్స్‌పై రూ.19 వేల కోట్లు వసూలు

Sai Kiran
Raghav chadha bank charges : మినిమం బ్యాలెన్స్‌పై రూ.19 వేల కోట్లు వసూలు

Raghav chadha bank charges : పార్లమెంట్ వేదికగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ధా బ్యాంకుల మినిమం బ్యాలెన్స్ పెనాల్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న ఈ విధానాన్ని ఆయన నిశ్శబ్ద దోపిడీగా అభివర్ణించారు.

గత మూడు సంవత్సరాల్లో బ్యాంకులు కనీస నిల్వ లేదనే కారణంతో ఏకంగా రూ.19 వేల కోట్లు వసూలు చేశాయని ఆయన పేర్కొన్నారు. ఈ మొత్తం ధనికుల నుంచి కాకుండా సామాన్య ప్రజల నుంచి వసూలు చేయబడిందని అన్నారు.

పేదలపై భారం

ఈ పెనాల్టీలు రోజువారీ కూలీలు, రైతులు, పెన్షనర్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని రాఘవ్ చద్ధా ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర అవసరాల కోసం ఖాతాలోని డబ్బు తీసుకున్న తర్వాత కూడా బ్యాంకులు పెనాల్టీలు విధించడం అన్యాయమని ప్రశ్నించారు.

Read also: West Bengal Election Schedule 2026: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించిన ఈసీ.. ఆ రోజే ఫలితాలు!

Raghav chadha bank charges
Raghav chadha bank charges

ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకుల వసూళ్లు

ప్రైవేట్ బ్యాంకులు సుమారు రూ.11 వేల కోట్లు, ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.8 వేల కోట్లు ఈ విధంగా వసూలు చేశాయని ఆయన వెల్లడించారు.

ఈ పెనాల్టీలను పేదలపై విధించిన పన్నుగా ఆయన అభివర్ణించారు.

పెనాల్టీల రద్దు డిమాండ్

జన్ ధన్ ఖాతాలకు మినహాయింపు ఉన్నప్పటికీ సాధారణ సేవింగ్స్ ఖాతాదారులపై భారీ భారం పడుతోందని అన్నారు.

ఈ నేపథ్యంలో మినిమం బ్యాలెన్స్ పెనాల్టీలను తక్షణమే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం మరియు ఆర్‌బీఐని రాఘవ్ చద్ధా డిమాండ్ చేశారు.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870