హై దరాబాద్ నగరానికి జీవనాడి గా ఒకప్పుడు ప్రవహించిన మూసీ నది, గత కొన్ని దశాబ్దాలుగా కాలుష్యం, నిర్లక్ష్యం, అశాస్త్రీయ నగ రీకరణ కారణంగా కాలువల సమాహా రంగా మారిపోయింది. ఒకప్పుడు నగ రానికి తాగునీటి వనరుగా నిలిచిన ఈ నది ప్రస్తుతం పారిశ్రామిక వ్యర్థాలు, మురుగు నీటివల్ల తీవ్ర కాలు ప్యానికి గురైంది. ఈపరిస్థితిని మార్చి మూసీని మళ్లీ పునరుద్ధరించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళికను రూపొందించింది. సుమారు 7 వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టబోయే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్) సిద్ధమై అమలు దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టు కేవలం నదిని శుభ్ర పరచడమే కాదు, హైదరా బాద్ నగర పర్యావరణాన్ని మెరుగుపరచడం, వరద ప్రమా దాలను తగ్గించడం, నగర అభివృద్ధికి కొత్త దిశను చూపిం చడం వంటి లక్ష్యాలను ముందుంచుకుంది. మూసీనది చరిత్రను పరిశీలిస్తే, ఈ నది హైదరాబాద్ నగర నిర్మాణం లో కీలక పాత్ర పోషించింది. మూసీకి ఉపనదులైన ఈసా, ఇతర వాగులు కలిసే ప్రాంతాల్లో పూర్వం వ్యవసాయం అభివృద్ధి చెందింది. హైదరాబాద్ నగరాన్ని స్థాపించిన మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలోనే మూసీ (Moosey River) నగరానికి ప్రధాన జలవనరుగా ఉపయోగించబడింది. అయితే 1908 లో జరిగిన భారీ వరదలు నగరాన్ని అతలాకుతలం చేశాయి. ఆ వరదల తర్వాత నగరానికి వరదల నుంచి రక్షణ కల్పిం చేందుకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య రూపొందించిన ప్రణా ళికల ప్రకారం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశ యాలునిర్మించబడ్డాయి. ఈ జలాశయాలు దశాబ్దాల పాటు హైదరాబాద్ నగరానికి తాగునీటి ప్రధాన వనరులుగా నిలిచాయి. కానీ 1980ల తరువాత హైదరాబాద్వే గంగా విస్త రించడం ప్రారంభమైంది. ఐటిరంగం అభివృద్ధి, పారిశ్రామిక విస్తరణ, జనాభా పెరుగుదల కారణంగా నగరంలో మురుగు నీటి పరిమాణం పెరిగింది.
Read Also : Strait of Hormuz: ముంద్రా పోర్టుకు చేరుతున్న శివాలిక్ నౌక!

నగరంలోని వందలాది కాలు వలు, మురుగు కాల్వలు మూసీలోకి కలవడం ప్రారంభ మైంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో రోజుకు సుమారు 2 వేల మిలియన్లీ టర్లకు పైగా మురుగు నీరు ఉత్పత్తి అవుతున్నదని అంచనా. అందులో గణనీయమైన భాగం సరైన శుద్ధి లేకుండానే మూసీ నదిలోకి చేరుతున్నదనే ఆందోళనలు ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక రూపొందించింది. మూసీ నది మొత్తం సుమారు 55 కిలోమీటర్ల పొడవున హైదరా బాద్ నగర పరిధిలో ప్రవహిస్తుంది. ఈ మొత్తం ప్రాంతాన్ని ఐదు జోన్లుగా విభజించి అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించారు. మొదటి దశలో సుమారు 20 కిలోమీటర్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందులో హిమాయత్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు సుమారు 9 కిలోమీటర్ల భాగం ప్రధానంగా అభివృద్ధి చేయ బడనుంది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో ప్రధానంగా నాలుగు అంశాలు కీలకంగా నిలుస్తాయి. మొదటిది కాలుష్య నియంత్రణ. నగరంలోని మురుగు కాల్వలు నదిలోకి చేర కుండా ఇంటర్ సెప్టర్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సుమారు 3,100కోట్ల రూపా యల వ్యయంతో ట్రంక్ఇం టర్ సెప్టర్ సీవర్ వ్యవస్థ ఏర్పా టు చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఇది నగరంలోని ప్రధాన మురుగు కాల్వలను మళ్లించి శుద్ధి కేంద్రాలకు తరలిస్తుంది. రెండవది నీటి ప్రవాహాన్ని స్థిరంగా ఉంచడం. ప్రస్తుతం మూసీ నది (Moosey River)ఎక్కువగా మురుగు నీటిపై ఆధార పడి ప్రవహిస్తున్నది. దీనికి పరిష్కారంగా గోదావరి జలా లను హైదరాబాద్కు తరలించే ప్రాజెక్టుల ద్వారా కొంత నీటిని మూసీ ప్రవాహానికి విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మల్లన్నసాగర్ నుంచి తాగునీటి సరఫరాతో పాటు మూసీ నదిని పునరుజ్జీవం చేయడానికి నీటిని మళ్లిం చే ప్రణాళిక కూడా సిద్ధమైంది. మూడవది పర్యావరణ పరి రక్షణ. నది తీరప్రాంతాల్లో భారీగా హరిత వనాలు, పార్కు లు, ప్రజలకు విశ్రాంతి ప్రాంతాలు ఏర్పాటు చేయనున్నారు. నగరంలోని ప్రజలు నదిని ఆస్వాదించేందుకు వాకింగ్హాకు లు, సైక్లింగ్మార్గాలు, వినోద కేంద్రాలు ఏర్పాటు చేయా లని ప్రణాళిక ఉంది. నాలుగవది పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి. నది తీరాల వెంట సేవా రహదారులు, కొత్త వంతెనలు, ప్రజలకు సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా నగర ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టుకు నిధుల సమీకరణ కూడా ముఖ్యమైన అంశంగా మారింది. ఆసియా అభివృద్ధిబ్యాంకు నుంచి సుమారు 4,100కోట్ల రూపాయల రుణాన్ని పొం దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అదనంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నుంచి జాతీయ నది పరిరక్షణ పథకం కింద మరికొన్ని వేల కోట్ల రూపాయలు పొందేందు కు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రాజెక్టు అమలు కోసం ప్రత్యేకంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈసంస్థ ప్రణాళిక రూపకల్పన, భూసేకరణ, నిర్మాణ పనుల పర్యవేక్షణ వంటి బాధ్యతలను నిర్వహిస్తుంది. అంతర్జాతీయ స్థాయి సలహాదా రులతో కలిసి ప్రాజెక్ట్ మాస్టర్ ప్లాన్ రూపొందించబడింది. అయితే ఈప్రాజెక్టుపై కొంతమంది పర్యావరణవేత్తలు, సామా జిక సంస్థలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి.

ముఖ్యంగా నది తీరప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల పునరావాసం, భూ సేకరణ ప్రక్రియ, పర్యావరణ ప్రభావం వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. ప్రజల అభిప్రాయాలను పరిగణ లోకి తీసుకుని ప్రాజెక్టును అమలుచేయాలని కొందరు కార్య కర్తలు సూచిస్తున్నారు. మరోవైపు నగరాభివృద్ధి నిపుణులు ఈ ప్రాజెక్టును హైదరాబాద్ భవిష్యత్తుకు కీలకంగా భావిస్తు న్నారు. ప్రపంచంలోని అనేక నగరాలు తమనదులను పున రుద్ధరించి పర్యాటక కేంద్రాలుగా మార్చుకున్నాయి. ఉదాహ రణకు లండన్లో థేమ్స్,ఆహ్మదాబాద్ లో సబర్మతి నదీ తీర అభివృద్ధి నగర అభివృద్ధికి దోహదపడింది. అదే తరహా లో మూసీ కూడా పునరుజ్జీవం అయితే హైదరాబాద్ నగ రానికి పర్యావరణ పరంగా, ఆర్థికపరంగా పెద్ద ప్రయోజనం కలుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. మూసీ నది శుద్ది కావడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మొదటగా నగరపర్యావరణం మెరుగుపడుతుంది. ప్రస్తుతం నదినుంచి వ్యాపిస్తున్న దుర్వాసన, దోమల సమస్యలు తగ్గే అవకాశం ఉంది. రెండవది వరదల ప్రమాదం తగ్గుతుంది. నది తీరాలను శాస్త్రీయంగా అభివృద్ధి చేస్తే భారీ వర్షాల సమయంలో నీటి ప్రవాహం సాఫీగా సాగుతుంది. మూడవది నగరానికి కొత్త వినోద ప్రాంతాలు ఏర్పడతాయి.అయితే ప్రాజెక్టు విజ యవంతం కావాలంటే కేవలం నిర్మాణ పనులు సరిపోవు. నగరంలోని మురుగు కాల్వలను పూర్తిగా నియంత్రించాలి. పారిశ్రామిక వ్యర్థాల విడుదలను కట్టడి చేయాలి. ప్రజల్లో కూడా పర్యావరణ అవగాహన పెంచాలి. లేదంటే భారీ వ్య యంతో చేపట్టిన ప్రాజెక్టు దీర్ఘకాలంలో ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చు. మొత్తం మీద 7 వేల కోట్ల రూపాయల వ్య యంతో రూపొందుతున్న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు హైద రాబాద్ నగర చరిత్రలో ఒక కీలక మైలురాయిగావిలవ వచ్చు. శాస్త్రీయ ప్రణాళిక, పారదర్శక అమలు, ప్రజల భాగ స్వామ్యం ఉంటే మూసీ నది మళ్లీ జీవనదిగా మారే అవకా శం ఉంది. ఒకప్పుడు నగరానికి ప్రాణాధారంగా నిలిచిన మూసీ మళ్లీ అదే వైభవాన్ని సంతరించుకుంటే అది కేవలం పర్యావరణ విజయం మాత్రమే కాదు, హైదరాబాద్ నాగరికతకు కొత్త అధ్యాయంఅవుతుంది.
-రామ కిష్టయ్య సంగన భట్ల
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: