Central Govt:వంటగ్యాస్ కొరతపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన

Central Govt: దేశంలో వంటగ్యాస్ (LPG) కొరత ఏర్పడనుందనే ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం తెరదించింది. గృహ వినియోగదారులకు 100 శాతం సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాల్లోనూ గృహావసరాలకు సరిపడా ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని చమురు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎల్పీజీతో పాటు పెట్రోల్, డీజిల్ లభ్యతపై కూడా కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశంలోని అన్ని చమురు శుద్ధి కర్మాగారాలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని తెలిపింది. … Continue reading Central Govt:వంటగ్యాస్ కొరతపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన