हिन्दी | Epaper

CBSE Exam Cancel: యుద్ధం ఎఫెక్ట్.. ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన సీబీఎస్‌ఈ

Anusha
CBSE Exam Cancel: యుద్ధం ఎఫెక్ట్.. ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన సీబీఎస్‌ఈ

CBSE Exam Cancel: పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య నెలకొన్న భీకర యుద్ధ వాతావరణం విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఇరు పక్షాలు పరస్పరం చమురు కేంద్రాలు, మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా దాడులకు తెగబడుతుండటంతో.. స్థానికంగా ఉన్న భారతీయ విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలోని పలు దేశాలు, గల్ఫ్ దేశాల్లో జరగాల్సిన ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Read Also: TN Elections 2026: విజయ్‌కు బీజేపీ బంపర్ ఆఫర్.. 80 సీట్లు, డిప్యూటీ సీఎం పదవి?

మార్చి 15న అధికారిక సర్క్యూలర్ జారీ

వాస్తవానికి మార్చి 16 నుంచి ఏప్రిల్ 10వ తేదీ మధ్య ఈ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం అక్కడ నెలకొన్న ఉద్రిక్త వాతావరణం ఏ క్షణంలోనైనా ప్రమాదకరంగా మారే అవకాశం ఉండటంతో, విద్యార్థుల క్షేమమే ప్రాధాన్యతగా బోర్డు ఈ చర్య తీసుకుంది. దీనికి సంబంధించి మార్చి 15న సీబీఎస్‌ఈ ఒక అధికారిక సర్క్యూలర్‌ను విడుదల చేస్తూ పూర్తి వివరాలను వెల్లడించింది.

War effect.. CBSE cancels inter exams
War effect.. CBSE cancels inter exams

ఈ మేరకు CBSE గుర్తింపు పొందిన బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా అలాగే యూఏఈ లోని పాఠశాలల్లో ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.ఇంతకుముందు ఇంటర్ పరీక్షలకు సంబంధించిన కొన్ని పరీక్షలను సీబీఎస్ఈ రద్దు చేసిన విషయం తెలిసిందే. మార్చి 1, 3, 5 తేదీల్లో ఈ పరీక్షలకు సంబంధించిన సర్క్యూలర్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జారీ చేసిన సర్క్యూలర్ ప్రకారం ఆ పరీక్షలపై ఉన్న రద్దు అంశం అలాగే కొనసాగుతుందని తాజాగా సీబీఎస్ఈ స్పష్టం చేసింది.

విద్యార్థుల భద్రత దృష్ట్యా

ఈ మేరకు సీబీఎస్ఈ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సన్యమ్ భరద్వాజ్ పేర్కొన్నారు.పరీక్షలు రద్దు అయిన దేశాల్లో త్వరలోనే కొత్త తేదీలు ప్రకటిస్తామని.. ఆ తర్వాత ఫలితాల కోసం ప్రత్యేక తేదీలను కేటాయిస్తామని బోర్డు స్పష్టం చేసింది. అయితే తాజాగా సీబీఎస్ఈ బోర్డు తీసుకున్న నిర్ణయం గల్ఫ్ దేశాల్లోని అనేకమంది విద్యార్థులపై ప్రభావం పడనుంది. అయితే విద్యార్థుల భద్రత దృష్ట్యా బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870