Raashii Khanna: సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నీరజ కోన దర్శకత్వంలో వచ్చిన ‘తెలుసు కదా’ చిత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై హీరోయిన్ రాశీ ఖన్నా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. షూటింగ్ జరుగుతున్నప్పుడే ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో తనకు ఒక అవగాహన వచ్చేసిందని ఆమె ఓపెన్‌గా వెల్లడించారు. స్క్రిప్ట్‌లో తనకు నచ్చని పాయింట్స్ గురించి డైరెక్టర్‌కు చెప్పినప్పటికీ, ఆమె విజన్‌పై నమ్మకంతోనే ముందుకు వెళ్లాల్సి వచ్చిందని రాశీ పేర్కొన్నారు.
Read Also: Suryakumar Yadav: అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదేళ్లు.. సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగం

నేర్చుకున్న గుణపాఠం
క్లైమాక్స్ కూడా అందరూ ఒప్పుకునేలా ఉండాలి, ఇదేదో తేడా కొడుతోందని నాకు అనిపించింది. అందుకే ఆపరేషన్ సీన్ చేయనన్నాను. చివరకు తప్పలేదు. అయినా ఈ సినిమా ద్వారా అందరూ ఏదో ఒక గుణపాఠం నేర్చుకున్నారు. అలా నేను కూడా నా అభిప్రాయాన్ని మరింత గట్టిగా చెప్పాల్సింది అని తెలుసుకున్నాను. ఆ మూవీ షూట్ చేస్తున్నకొద్దీ స్క్రిప్ట్ చాలా మారిపోయింది. నా చేతుల్లో ఏం లేదు’ అని రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా తెలుసు కదా సినిమాలో సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటించాడు. శ్రీనిధి శెట్టి మరో హీరోయిన్ గా యాక్ట్ చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: