Rajasekhar: సోషల్ మీడియాలో గత కొంతకాలంగా తనపై వస్తున్న ఆసక్తికరమైన ప్రచారంపై టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ స్పందించారు. రాజశేఖర్‌కు ‘గోలీల’ (Marble) ఫ్యాక్టరీ ఉందంటూ, దాని ద్వారా ఆయన కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారంటూ వైరల్ అవుతున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు.

అసలు ప్రచారం ఏమిటి?
“రాజశేఖర్‌కు గోలీల వ్యాపారం ఉంది.. బంగ్లాదేశ్, పాకిస్థాన్, భారత్ వంటి దేశాల్లో గోలీలను విక్రయిస్తూ ఆయన నెలకు రూ. 3 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకు సంపాదిస్తున్నారు” అనే వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొట్టాయి. ఇది నిజమేనని నమ్మి చాలామంది ఆయనను నేరుగా కూడా ప్రశ్నించారట.
రాజశేఖర్ ఏమన్నారంటే?
ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రాజశేఖర్ ఈ విషయంపై మాట్లాడుతూ.. “నాకు ఎలాంటి గోలీల ఫ్యాక్టరీ లేదు. ఆ వీడియోలు చూసి నాకు నేనే నవ్వుకున్నాను. నాకు ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? కోట్ల రూపాయల సంపాదన ఎక్కడ ఉంది అని ఆశ్చర్యపోయాను. తెలిసిన వారు కూడా ఫోన్ చేసి ‘నిజంగానే ఫ్యాక్టరీ ఉందా?’ అని అడుగుతుంటే వింతగా అనిపించింది” అని స్పష్టం చేశారు.
ఇమిటేషన్లపై స్పందన:
తనను ఇమిటేట్ చేసే వారి గురించి కూడా రాజశేఖర్ సరదాగా మాట్లాడారు. “మొదట్లో ఎవరైనా నన్ను ఇమిటేట్ చేస్తే నిజంగా నేను అలాగే చేస్తానా? అనిపించేది. ముఖ్యంగా దర్శకుడు అనిల్ రావిపూడి నన్ను, వెంకటేష్‌ను చాలా బాగా ఇమిటేట్ చేస్తారు. ‘రోజా పువ్వా’ పాటలో నేను చేసిన స్టెప్పులు నాకే గుర్తు లేవు కానీ, ఎవరైనా స్టేజ్‌పై అది చేస్తే చూసి ఎంజాయ్ చేస్తాను” అని చెప్పుకొచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :