Land Registration Rules: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ యజమానులకు భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పూర్వీకుల నుంచి వారసత్వంగా లభించిన భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేసింది. ముఖ్యంగా వ్యవసాయేతర స్థలాల బదిలీ సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేలా ఈ సంస్కరణలు చేపట్టింది.
Read Also : RRB Admit Card: ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ అడ్మిట్ కార్డులు విడుదల

సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటే చాలు
గతంలో వారసత్వ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే రెవెన్యూ శాఖ నుంచి ధ్రువీకరణ పత్రాలు (Revenue Certificates) పొందడం తప్పనిసరిగా ఉండేది. దీనివల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యం అవ్వడమే కాకుండా ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అయితే, తాజా నిబంధనల ప్రకారం.. ఇకపై రెవెన్యూ అధికారుల సర్టిఫికెట్లు అవసరం లేదు. కేవలం యజమాని సమర్పించే సెల్ఫ్ డిక్లరేషన్ (Self Declaration) ఆధారంగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ఆదేశించింది. భూ వివాదాలను తగ్గించడంతో పాటు, సామాన్యులకు త్వరితగతిన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: