हिन्दी | Epaper

AP Job Calendar 2026: నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది రోజున ఏపీ జాబ్ క్యాలెండర్!

Pooja
AP Job Calendar 2026: నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది రోజున ఏపీ జాబ్ క్యాలెండర్!

AP Job Calendar 2026: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండుగ కానుకగా భారీ నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. సుమారు 60 ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 10,000 పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం ‘జాబ్ క్యాలెండర్’ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక కసరత్తు తుది దశకు చేరుకుంది.

Read Also : RRB Admit Card: ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ అడ్మిట్ కార్డులు విడుదల

AP Job Calendar 2026
AP Job Calendar 2026: Good News for the Unemployed—AP Job Calendar on Ugadi!

ఏయే శాఖల్లో ఎన్ని పోస్టులంటే?

ఈ జాబ్ క్యాలెండర్‌లో అత్యధికంగా విద్యాశాఖలో నియామకాలు ఉండబోతున్నాయి. డీఎస్సీ (DSC) ద్వారా సుమారు 3,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు ఏపీపీఎస్సీ ద్వారా 101 గ్రూప్-1, 470 గ్రూప్-2 పోస్టులను భర్తీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1,500 అధ్యాపక పోస్టులు కూడా ఈ జాబ్ క్యాలెండర్‌లో చేర్చే అవకాశం ఉంది.

పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా మరో 1,000 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఏయే విభాగాల్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయనే అంశంపై మరో రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల కోసం విడుదల చేయబోతున్న మొదటి అతిపెద్ద జాబ్ క్యాలెండర్ కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870