हिन्दी | Epaper

Sun TV Network-CSK: సీఎస్కేపై సన్ టీవీ కాపీరైట్ దావా

Aanusha
Sun TV Network-CSK: సీఎస్కేపై సన్ టీవీ కాపీరైట్ దావా

Sun TV Network-CSK: ఐపీఎల్ క్రికెట్ మైదానంలో పరుగుల వర్షం కురిపించే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు ఇప్పుడు న్యాయస్థానంలో చిక్కుల్లో పడింది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ (సన్ టీవీ నెట్ వర్క్), సీఎస్కే ఫ్రాంచైజీపై మద్రాస్ హైకోర్టులో కాపీరైట్ ఉల్లంఘన దావా వేసింది. తమ సినిమాలకు సంబంధించిన ఆడియో కంటెంట్‌ను వాణిజ్య ప్రచారంలో వాడుకున్నందుకు భారీ జరిమానా డిమాండ్ చేసింది.

Read Also: FIFA 2026: ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

అనిరుధ్ ఒప్పందాల సమర్పణ

తమ అనుమతి లేకుండానే జైలర్, జైలర్-2, కూలీ సినిమాల్లోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఆడియో ట్రాక్‌లు, డైలాగులను సీఎస్కే తమ ప్రచార వీడియోలో వాడుకుందంటూ రూ.1 కోటికి దావా వేసింది. వాణిజ్యపరంగా వాటిని ఉపయోగించడం కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపింది.సీఎస్కే ఉపయోగించిన కంటెంట్ కాపీరైట్ రక్షణ పరిధిలో ఉందని, దీనిని వినియోగించుకోవాలంటే తమ ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఆ చిత్రాల నిర్మాతలు హైకోర్టుకు తెలిపారు. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌తో తాము చేసుకున్న ఒప్పందాలను హైకోర్టుకు వారు సమర్పించారు.

Jailer, Coolie Makers Sues Chennai Super Kings Over Use Of Songs In New  Jersey Promo | Bollywood Bubble
Sun TV’s copyright lawsuit against CSK…here’s the reason!

కాపీ రైట్ కలిగిన కంటెంట్‌ను సీఎస్కే అనధికారికంగా వినియోగిస్తోందని మార్చి 1న మెయిల్ కూడా పంపించామని, దాంతో తమ మెటిరీయల్ వినియోగాన్ని సీఎస్కే నిలిపివేసిందని సన్ టీవీ తరఫున రవీంద్రన్ పేర్కొన్నారు. సంగీత దర్శకుడు అనిరుధ్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం హక్కులన్నీ తమకే చెందుతాయని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరారు.తాము ఇప్పటికే ఆ కంటెంట్‌ను నిలిపివేశామని చెన్నై సూపర్ కింగ్స్ కూడా హైకోర్టుకు తెలిపింది. ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ఆంక్షలు, జరిమానాలపై నిర్ణయం తీసుకోవడానికి ముందు మరోసారి ఇరుపక్షాల వాదనలను వినాలని నిర్ణయించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ ఫిక్స్

ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ ఫిక్స్

అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదేళ్లు.. సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగం

అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదేళ్లు.. సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగం

పాకిస్థాన్ లీగ్‌ను కాదన్న ముజరబానీపై పీసీబీ ఫైర్?

పాకిస్థాన్ లీగ్‌ను కాదన్న ముజరబానీపై పీసీబీ ఫైర్?

ఎల్బీ నగర్ – హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్

ఎల్బీ నగర్ – హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

నాకు గోలీల ఫ్యాక్టరీ ఉందా? రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నటుడు రాజశేఖర్!

నాకు గోలీల ఫ్యాక్టరీ ఉందా? రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నటుడు రాజశేఖర్!

📢 For Advertisement Booking: 98481 12870