हिन्दी | Epaper

US vs Iran: లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

Pooja
US vs Iran: లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

US vs Iran: అంతర్జాతీయ రాజకీయ యవనికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఇరాన్ దేశం తమ దాడులకు భయపడి లొంగిపోయేందుకు సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం జి-7 (G-7) దేశాల ప్రతినిధులతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ట్రంప్ ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించినట్లు ప్రముఖ వార్తా సంస్థ ‘ఆక్సియోస్’ (Axios) తన నివేదికలో పేర్కొంది.

Read Also:Trump Putin Viral Photo: పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

US vs Iran
US vs. Iran: Iran Ready to Surrender… Trump Makes Sensational Remarks!

ఇరాన్‌లో నిర్ణయాలు తీసుకునే నేతలే లేరు

ఇరాన్ ప్రస్తుతం తీవ్ర గందరగోళంలో ఉందని, అక్కడ యుద్ధాన్ని ముందుకు నడిపించే నాయకత్వమే కరువైందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అమెరికా జరిపిన దాడుల ధాటికి ఇరాన్ ఉన్నతాధికారులు మరియు కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారని, ఇప్పుడు నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఎవరూ మిగిలి లేరని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. “అక్కడ లీడర్ అంటూ ఎవరూ లేరు, అందుకే లొంగిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించే నాథుడే కరువయ్యారు” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పీక్ స్టేజ్‌కు చేరిన తరుణంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇరాన్ అంతర్గత పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ తన పతనాన్ని అంగీకరించే స్థితికి చేరుకుందని, అయితే దానిని ప్రకటించడానికి సరైన నాయకత్వం లేకపోవడమే ప్రస్తుత జాప్యానికి కారణమని ట్రంప్ జి-7 నేతలకు వివరించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు గమనిస్తుంటే త్వరలోనే మధ్యప్రాచ్యంలో భారీ మార్పులు సంభవించే అవకాశం కనిపిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ తేదీ ఫిక్స్

ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ తేదీ ఫిక్స్

అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదేళ్లు.. సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగం

అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదేళ్లు.. సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగం

పాకిస్థాన్ లీగ్‌ను కాదన్న ముజరబానీపై పీసీబీ ఫైర్?

పాకిస్థాన్ లీగ్‌ను కాదన్న ముజరబానీపై పీసీబీ ఫైర్?

ఎల్బీ నగర్ – హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్

ఎల్బీ నగర్ – హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

📢 For Advertisement Booking: 98481 12870