हिन्दी | Epaper

Iran War: గ్యాస్ కొరత: గ్యాస్ స్టవ్‌కు ప్రత్యామ్నాయాల వైపు పరుగులు

Vanipushpa
Iran War: గ్యాస్ కొరత: గ్యాస్ స్టవ్‌కు ప్రత్యామ్నాయాల వైపు పరుగులు

యుద్ధం అంటే అంతే. ఎక్కడ యుద్ధం జరుగుతున్నా ప్రపంచమంతటా దాని ప్రభావం ఏదో రూపంలో పడుతుంది. మధ్యప్రాచ్యంలో యుద్ధం అంటే మన వంట ఇంట్లోకీ చొచ్చుకొచ్చేస్తుంది. డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలు మండిపోతాయి. పరిస్థితులు ముదిరితే అసలు అవి దొరకడమే గగనమవుతాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. వంట గ్యాస్ ధరలు పెరగడమే కాదు.. సిలిండర్ల కొరత కూడా పెరుగుతోందన్న వార్తలు గుబులు పుట్టిస్తున్నాయి. ఇల్లయినా హోటలయినా గ్యాస్ ఉంటేనే వంటలు, వడ్డించడాలు. లేదంటే తంటాలే. ఈ పరిస్థితుల్లో ప్రత్నామ్నాయ వంట వ్యవస్థల కోసం చూడక తప్పదు. పట్టణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యిలు, కిరోసిన్ స్టవ్‌లు (Kerosene stoves), బొగ్గుల కుంపటి వంటివి దాదాపు మాయమయ్యాయి.

Read Also: Trump: మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై డొనాల్డ్ ట్రంప్ క్లారిటీ

Iran War: Gas shortage: Rush towards alternatives to gas stoves
Iran War: Gas shortage: Rush towards alternatives to gas stoves

ఆధునిక ప్రత్యామ్నాయాలూ ఉన్నాయి

నేటి తరం చాలా మంది వాటిని చూసికూడా ఉండరు. కానీ పల్లెసీమల్లో కనిపిస్తూనే ఉన్నాయి. అయితే పట్టణ ప్రాంతాల్లో మైక్రో-ఓవెన్, ఇండక్షన్ స్టవ్.. వంటి ఆధునిక ప్రత్యామ్నాయాలూ ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో గాబరా పడకుండా ఎలాంటి ప్రత్యామ్నాయ పొయ్యిలు ఉపయోగించవచ్చు, వాటి ఇంధనాలు ఏమిటో చూద్దాం. ఇలాంటి సంక్షోభం తలెత్తితే ఎదుర్కోవడానికి హైబ్రీడ్ వంట వ్యవస్థలను ఎలా సిద్ధం చేసుకోవాలో కూడా పరిశీలిద్దాం. ఇండక్షన్ కుక్‌టాప్‌లు పట్టణ ప్రాంతాల్లో గ్యాస్‌ స్టవ్‌కు ప్రధాన ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. కరెంటుతో పనిచేసే ఈ స్టవ్‌లు మంటతో కాకుండా అయస్కాంత శక్తితో పాత్రను నేరుగా వేడి చేస్తాయి. దీంతో పాత్రలు త్వరగా వేడెక్కుతాయి. కరెంట్ వృథా తక్కువ. పప్పు ఉడికించడానికి, పాలు మరిగించడానికి, కూరలు తదితర వంటలకు ఇవి చాలా బాగా పనిచేస్తాయి. లాభాలు: వంట వేగంగా పూర్తవుతుంది. మంట లేకపోవడం వల్ల ఇది సురక్షితమైనది కూడా. దీనిని శుభ్రం చేయడం కూడా సులభం. ఇన్‌ఫ్రారెడ్ స్టవ్ బయటకు ఇండక్షన్‌ స్టవ్ లాగే కనిపిస్తుంది కానీ పనిచేసే విధానం భిన్నం. ఇది అడుగున ఉండే ఇన్‌ఫ్రారెడ్ కాయిల్స్ ద్వారా వేడిని ఉత్పత్తి చేసి పాత్రను వేడెక్కేలా చేస్తుంది. ఇది కూడా కరెంట్‌తోనే పనిచేస్తుంది. మైక్రోవేవ్ ఓవెన్ ఎక్కువగా వంటకాలను వేడి చేయడానికి, ఆవిరితో చేసే వంటలకు ఉపయోగపడుతుంది.

    Read hindi news: hindi.vaartha.com

    Epaper : epaper.vaartha.com

    Read Also:

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

    📢 For Advertisement Booking: 98481 12870