పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, అమెరికా వైమానిక దళానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌తో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, ఇరాక్ గగనతలంలో అమెరికాకు చెందిన KC-135 ఏరియల్ రీఫ్యూయలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ కుప్పకూలింది. యుద్ధ విమానాలకు గాలిలోనే ఇంధనాన్ని నింపే ఈ భారీ విమానం ప్రమాదానికి గురవ్వడం కలకలం సృష్టిస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ విమానంలో ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఘటనా స్థలంలో అమెరికా రక్షణ బలగాలు భారీ ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. అయితే, ఈ విమానం శత్రు దేశాల కాల్పుల వల్ల కానీ, లేదా పొరపాటున జరిగిన ‘ఫ్రెండ్లీ ఫైర్’ వల్ల కానీ కూలిపోలేదని అమెరికా రక్షణ శాఖ స్పష్టం చేసింది. సాంకేతిక లోపం లేదా ఇతర కారణాలపై దర్యాప్తు జరుగుతోందని వెల్లడించింది.
Allu Cinemas Launch: లారీల్లో వెళ్లి సినిమాలు చూసేవాళ్లం: సీఎం రేవంత్
అమెరికా వైమానిక దళం ఇటీవల వరుస ప్రమాదాలతో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ KC-135 ప్రమాదానికి కొద్ది రోజుల ముందే, కువైట్‌లో జరిగిన ఒక పొరపాటు వల్ల ‘ఫ్రెండ్లీ ఫైర్’ (తమ దళాల కాల్పులకే తమ విమానాలు గురికావడం) లో మూడు అత్యాధునిక F-15 యుద్ధ విమానాలను అమెరికా కోల్పోయింది. ఒకవైపు ఇరాన్‌తో యుద్ధం ముదురుతున్న సమయంలో ఇలా వరుసగా యుద్ధ విమానాలు ధ్వంసం కావడం అమెరికా రక్షణ సామర్థ్యంపై ఒత్తిడి పెంచుతోంది. తాజా ఘటనలో మరో విమానం మాత్రం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. యుద్ధ క్షేత్రంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన సమయంలో ఇలాంటి ప్రమాదాలు జరగడం అమెరికా సేనలను ఆందోళనకు గురిచేస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :