ఉద్యోగులకు ఇచ్చే భోజన అలవెన్స్‌పై పన్ను(Tax) మినహాయింపు పరిమితిని పెంచాలని ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 2026లో కీలక ప్రతిపాదన చేసింది. ప్రస్తుతం రోజుకు ₹50గా ఉన్న మినహాయింపును రోజుకు ₹200కు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే ఉద్యోగులకు పెద్ద ఎత్తున ఆర్థిక ఊరట లభించే అవకాశం ఉంది.
Read Also:Anthropic effect: సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు ముప్పుందా?

ఏటా ₹1 లక్షకు పైగా ట్యాక్స్ మినహాయింపు అవకాశం
కొత్త ప్రతిపాదన అమలులోకి వస్తే ఉద్యోగులు మీల్స్ ఖర్చుల కింద సంవత్సరానికి గరిష్ఠంగా ₹1,05,600 వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు. ఇది ఉద్యోగుల చేతిలో ఎక్కువ నికర ఆదాయం (Take Home Salary) పెరిగేందుకు దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా సంస్థలు ఫుడ్ కార్డులు, క్యాంటీన్ సదుపాయాల(Tax) ద్వారా ఈ భత్యాన్ని అందిస్తున్నాయి. మినహాయింపు పెరిగితే ఈ సదుపాయాలను మరింతగా వినియోగించుకునే అవకాశం ఉద్యోగులకు ఉంటుంది.
ఈ మినహాయింపు పాత పన్ను విధానంలో ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసే ఉద్యోగులకు వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. అయితే కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికి కూడా ఇదే ప్రయోజనం వర్తిస్తుందా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కొత్త పన్ను విధానంలో చాలా మినహాయింపులు తొలగించబడిన నేపథ్యంలో, ఈ ప్రయోజనం కొనసాగుతుందా లేదా అనే అంశంపై ఉద్యోగుల్లో ఆసక్తి నెలకొంది.
ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలు
- నెలవారీ జీతంలో నికర ఆదాయం పెరుగుతుంది
- ఫుడ్ కార్డులు, క్యాంటీన్ ఖర్చులపై పన్ను భారము తగ్గుతుంది
- మధ్యతరగతి ఉద్యోగులకు ఆర్థిక ఊరట లభిస్తుంది
- సంస్థల బెనిఫిట్స్ ప్యాకేజీ మరింత ఆకర్షణీయంగా మారుతుంది
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: