हिन्दी | Epaper

India: పాకిస్థాన్‌కు షాకిచ్చిన యూఏఈ

Vanipushpa
India: పాకిస్థాన్‌కు షాకిచ్చిన యూఏఈ

గతవారం భారత్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆకస్మిక పర్యటన‌ దక్షిణాసియా భౌగోళిక రాజకీయ సమీకరణాలను మలుపుతిప్పింది. ముఖ్యంగా పాకిస్థాన్‌కు పరోక్షంగా ఎదురుదెబ్బ తగిలేలా చేసింది. షేక్ నహ్యాన్ మూడు గంటల పర్యటన తర్వాత.. ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహించే ప్రణాళికను యూఏఈ రద్దు చేసుకుంది. ఈ ఒప్పందం ఆగస్టు 2025 నుంచి చర్చల్లో ఉంది. దీనిని పాక్ పత్రిక ‘ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ ధ్రువీకరించింది. ఈ ప్రాజెక్టుపై అబుదాబి ఆసక్తి కోల్పోవడం, కార్యకలాపాలను ఔట్‌సోర్స్ చేయడానికి స్థానిక భాగస్వామిని పేర్కొనడంలో విఫలం కావడంతో ఈ ప్రణాళికను నిలిపివేసినట్లు నివేదించింది. పాక్ మీడియా నివేదిక ఈ ఒప్పందం రద్దును రాజకీయ కారణాలతో ముడిపెట్టలేదు. అయితే, ఇది యూఏఈ, సౌదీ అరేబియా మధ్య పెరుగుతున్న విభేదాల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఒకప్పుడు గల్ఫ్ దేశాల్లో అత్యంత సన్నిహిత మిత్రులుగా ఉన్న రియాద్, అబుదాబి.. యెమెన్‌లో ప్రత్యర్థి వర్గాలకు మద్దతు విషయంలో బహిరంగంగా విభేదిస్తున్నాయి.

Read Also: Iran Protests: ఇరాన్‌పై దాడి యోచన రద్దు చేసిన ట్రంప్

India: పాకిస్థాన్‌కు షాకిచ్చిన యూఏఈ
India: పాకిస్థాన్‌కు షాకిచ్చిన యూఏఈ

పాకిస్థాన్‌తో సౌదీ అరేబియా రక్షణ ఒప్పందం

పాకిస్థాన్‌తో సౌదీ అరేబియా రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే, టర్కీతో కలిసి ‘ఇస్లామిక్ NATO’ను ఏర్పాటు చేయాలని సౌదీ కోరుకుంటోంది. మరోవైపు, పాక్ సైనిక నైపుణ్యంపై సౌదీ ఆధారపడుతుండగా.. భారత్‌తో యూఏఈ కొత్త రక్షణ ఒప్పందాలు చేసుకుంది. దాదాపు నాలుగు దశాబ్దాల కిందట వరకు పాకిస్థాన్ అతిపెద్ద వాణిజ్య భాగస్వాములలో ఒకటిగా యూఏఈ ఉండేది. వివిధ రంగాల్లో వేలాది మంది పాకిస్థానీయులు పనిచేయడంతో విదేశీ మారక ద్రవ్యం కు కీలక వనరుగా ఉండేది. ఇరు దేశాలు రక్షణ, ఇంధనం, పెట్టుబడి ప్రాజెక్టులలో పరస్పరం సహకరించుకున్నాయి. కానీ, ఏళ్లు గడిచేకొద్దీ, పాకిస్థాన్‌లోని భద్రతా సమస్యలు, లైసెన్సింగ్ వివాదాలు, పాడుబడిన మౌలిక సదుపాయాల కారణంగా సంబంధాలు దెబ్బతిన్నాయి. మోదీ- బిన్ జాయెద్ సమావేశం తర్వాత విడుదలైన సంయుక్త ప్రకటన దీర్ఘకాలిక భౌగోళిక, ఆర్థిక సంబంధాలకు ఒక బ్లూప్రింట్‌లా ఉంది. ఈ పర్యటన సందర్భంగా ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకం చేశారు. ఇది రక్షణ సహకారంపై ఫ్రేమ్‌వర్క్ ఒప్పందానికి మార్గం సుగమం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

ఒక్కటైన కుల్దీప్ యాదవ్-వన్షిక చద్దా
0:12

ఒక్కటైన కుల్దీప్ యాదవ్-వన్షిక చద్దా

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది
2:14

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

📢 For Advertisement Booking: 98481 12870