బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు పసిడి ధరలను పెంచేస్తున్నాయి. దేశీయంగా కూడా బంగారం ధరలు సామాన్యులకు అందని విధంగా దూసుకుపోతున్నాయి. అయితే బడ్జెట్ సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్రం బంగారం ధరలను నియంత్రించడానికి ఏం చేయబోతుందనే ఆసక్తికరంగా మారింది. ఫిబ్రవరి 1 న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో బంగారంపై తీసుకునే విధాన నిర్ణయాలు అత్యంత కీలకంగా మారాయి. గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి, వడ్డీ రేట్లపై అంచనాల మధ్య ఈక్విటీ మార్కెట్లు ఎరుపు-ఆకుపచ్చ మధ్య ఊగిసలాడినా, బంగారం మాత్రం బలమైన ర్యాలీ కొనసాగించింది. 1979 తర్వాత తన ఉత్తమ వార్షిక పనితీరును నమోదు చేస్తూ.. 2025లో బంగారం భారతీయ కుటుంబాలకు అత్యంత ఇష్టమైన సురక్షిత ఆస్తిగా మారింది.
Read Also: Pakistan blast: పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి..ఐదుగురు మృతి

నివేదికల అంచనాల ప్రకారం..
US వడ్డీ రేటు కోతల అంచనాలు, బలహీనమైన డాలర్, సేఫ్-హేవెన్ డిమాండ్ కలిసి ధరలను ఆకాశానికి ఎత్తాయి. గత ఏడాది ప్రపంచ బంగారం ధరలు దాదాపు 67 శాతం పెరిగి.. డిసెంబర్ 26న ట్రాయ్ ఔన్సుకు 4,549.7 డాలర్ల చరిత్రాత్మక స్థాయికి చేరుకున్నాయి. భారతీయ గృహాల వద్ద దాదాపు 34,600 టన్నుల బంగారం ఉంది. దీని విలువ సుమారు 3.8 ట్రిలియన్ డాలర్లు. ఇది అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా వంటి దేశాల కేంద్ర బ్యాంకుల కలిపిన బంగారం నిల్వల కంటే ఎక్కువ. 1.4 బిలియన్ల జనాభా ఉన్న భారతదేశంలో ఇది ఒక్కో వ్యక్తికి సగటున 25 గ్రాముల బంగారం ఉన్నట్టే. అందుకే బంగారం ధరల్లో చిన్న మార్పు కూడా దేశీయ ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావం చూపిస్తుంది. జూలై 2024లో ప్రభుత్వం బంగారంపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: