हिन्दी | Epaper

US: చిగురుటాకులా వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ

Vanipushpa
US: చిగురుటాకులా వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ

అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు ప్రకృతి ప్రకోపానికి చిగురుటాకులా వణికిపోతోంది. దశాబ్ద కాలంలోనే ఎన్నడూ చూడని రీతిలో భారీ మంచు తుఫాను (Winter Storm) దేశంలోని సగానికి పైగా జనాభాను గృహనిర్బంధం చేసింది. టెక్సాస్ నుంచి న్యూయార్క్ వరకు సుమారు 2,000 మైళ్ల మేర విస్తరించిన ఈ మంచు ముప్పు, కోట్లాది మంది జీవితాలను అస్తవ్యస్తం చేస్తోంది. ఇది కేవలం చలి మాత్రమే కాదు.. ప్రాణాలను హరించే ‘గడ్డకట్టే మృత్యువు’ అని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. జనవరి 23 నుంచి ప్రారంభమైన ఈ తుఫాను ప్రభావంతో అమెరికా(America)లోని దాదాపు 30 రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. సుమారు 20 కోట్ల మంది ప్రజలు ప్రస్తుతం విపరీతమైన చలి (Arctic Blast) మరియు మంచు హెచ్చరికల నీడలో ఉన్నారు. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, బోస్టన్ వంటి ప్రధాన నగరాల్లో సుమారు ఒక అడుగు (12 అంగుళాలు) మేర మంచు పేరుకుపోవచ్చని అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇది రెండు అడుగుల వరకు కూడా వెళ్లొచ్చని వాతావరణ శాఖ (NWS) తెలిపింది.

Read Also: USA: WHOతో సంబంధాలపై అమెరికా కీలక నిర్ణయం

US: చిగురుటాకులా వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
US: చిగురుటాకులా వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ

వేలాది విమాన సర్వీసులు రద్దు

తుఫాను కంటే భయంకరమైనది అది మోసుకొచ్చిన ఆర్కిటిక్ చలి గాలులు. మిన్నియాపాలిస్ వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 21 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయాయి. చలి గాలుల ప్రభావం (Wind Chill) వల్ల కొన్ని చోట్ల మైనస్ 50 డిగ్రీల చలి అనుభూతి కలుగుతోంది. ఇంతటి చలిలో బయటకు వస్తే నిమిషాల్లోనే ఫ్రాస్ట్‌బైట్ (చర్మం గడ్డకట్టడం) అయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. స్తంభించిన రవాణా.. అంధకారంలో నగరాలు: ఈ వారాంతంలో వేలాది విమాన సర్వీసులు రద్దు చేయబడ్డాయి. భారీ మంచుతో పాటు గట్టకట్టిన ఐస్ (Ice Storm) వల్ల చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో లక్షలాది ఇళ్లు చీకటిలో మగ్గుతున్నాయి. ప్రజలు ఆహారం, అత్యవసర మందులను నిల్వ చేసుకోవాలని 15 రాష్ట్రాల గవర్నర్లు ఎమర్జెన్సీ ప్రకటించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది
2:14

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

📢 For Advertisement Booking: 98481 12870