రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన రెండో టీ20 (IND vs NZ 2nd T20) మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కివీస్ ముందుగా బ్యాటింగ్ చేసి నిర్ణయించిన 209 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 15.2 ఓవర్లలోనే ఛేదించి, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లి సిరీస్‌పై పట్టుబిగించింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్..
Read Also: Team India: పాక్ రికార్డును బద్దలుకొట్టిన భారత్

సూర్య, ఇషాన్ ఊచకోత..
“భారత్ లాంటి బలమైన, లోతైన బ్యాటింగ్ ఉన్న జట్టుపై 300 పరుగులు చేసినా సరిపోవేమో, ఇలాంటి మంచి వికెట్‌పై 200-210 పరుగులు సురక్షితం కాదని మాకు అర్థమైంది” అని శాంట్నర్ అన్నాడు. శుక్రవారం జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 3 వికెట్లు కోల్పోయి 28 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (82 నాటౌట్), ఇషాన్ కిషన్ (76) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో జట్టుకు సునాయాస విజయాన్ని అందించారు. టీ20 (IND vs NZ 2nd T20) క్రికెట్ చరిత్రలో భారత్‌కు ఇది రెండో అత్యధిక పరుగుల ఛేదన కావడం విశేషం. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (44), కెప్టెన్ శాంట్నర్ (47 నాటౌట్) రాణించడంతో కివీస్ భారీ స్కోరు సాధించింది. అయినప్పటికీ, భారత బ్యాటర్ల దూకుడు ముందు ఈ స్కోరు సరిపోలేదు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: