దేశీయ సంప్రదాయ వైద్య విధానాలలో ఆయుర్వేదానికి ప్రత్యేక స్థానంఉంది. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ వైద్యశాస్త్రం కేవలం చికిత్సకే పరిమితం కాకుండా జీవన విధానంగా, ఆరోగ్య సంరక్షణ పద్ధతిగా భారతీయ సమాజం లో లోతుగా నాటుకుపోయింది. ‘సర్వే సంతు నిరామయాః’ అన్న భావనను ఆచరణలో పెట్టిన ఆయుర్వేదం, ఒకప్పుడు గ్రామీణ ప్రజలకు అత్యంత చేరువైన వైద్యవిధానం. అయితే నేటి పరిస్థితుల్లో బంగారం, వెండి వంటి లోహాల ధరలు విపరీతంగా పెరగడంతో ఆయుర్వేద ఔషధాల ఖర్చు కూడా ఆకాశాన్ని తాకుతోంది. ఈ పరిణామం ఆయుర్వేదాన్ని పేద ప్రజలకు అందని ద్రాక్షగా మారుస్తుందా? అన్న ప్రశ్న తీవ్రం గాఆలోచింపజేస్తోంది. ఆయుర్వేదంలో బంగారం, (Gold) వెండి వంటి లోహాలకు ప్రత్యేకమైన ఔషధ ప్రాముఖ్యత ఉంది. స్వర్ణ భస్మ, రాజత భస్మ వంటి తయారులు రోగనిరోధక శక్తిని పెంచడంలో, దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలో కీలకపాత్ర పోషిస్తాయని ఆయుర్వేద గ్రంథాలు పేర్కొంటాయి. ముఖ్యం గా పిల్లల ఆరోగ్యం కోసం ఇచ్చే స్వర్ణప్రాశనంలో బంగారం కీలక అంశం. అలాగే నరాల వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలు, మానసిక ఆరోగ్యసమస్యల చికిత్సలో ఈ భస్మలకు ప్రాధాన్యం ఉంది. కానీ అంతర్జాతీయ మార్కెట్ల ప్రభా వంతో బంగారం, వెండి ధరలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ ఔషధాల తయారీ ఖర్చు భారీగా పెరిగింది. దీని ప్రత్యక్ష ప్రభావం ఆయుర్వేద వైద్యం ఖర్చులపై పడు తోంది. ఒకప్పుడు తక్కువ ఖర్చుతో లభించిన ఆయుర్వేద మందులు, నేడు మధ్యతరగతి ప్రజలకు కూడా భారంగా మారుతున్నాయి. పేద ప్రజల సంగతి చెప్పనవసరం లేదు. ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రుల్లో కొంతవరకు ఉచిత చికిత్స అందుతున్నప్పటికీ, అవసరమైన అన్ని ఔషదాలు అందుబాటులో ఉండడం లేదు. ప్రైవేటు ఆయుర్వేద ఆసు పత్రులు, ఫార్మసీలలో ధరలు మరింత ఎక్కువగా ఉండటం తో పేదలు ఆయుర్వేద వైద్యానికి దూరమవుతున్నారు. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, ఇది సామాజిక ఆరో గ్యానికి సంబంధించిన సమస్య. ఆధునిక వైద్య విధానాలతో పోలిస్తే ఆయుర్వేదం దుష్ప్రభావాలు తక్కువగా ఉండే, సహజ చికిత్స పద్ధతి. అలాంటి వైద్య విధానం పేదలకు అందకుండాపోవడం అంటే, ఆరోగ్య అసమానతలు మరింత పెరగడమే.
Read Also : http://iPhone 18: ఐఫోన్ లాంచ్ ప్లాన్లో ట్విస్ట్.. ధరలు భారీగా పెరిగే ఛాన్స్!

ఒకవైపు సంపన్నులు ఖరీదైన ఆయుర్వేద చికిత్స లు పొందుతుంటే, మరోవైపు పేదలు తక్కువ నాణ్యత గల ప్రత్యామ్నాయాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈసమస్యకు ప్రభుత్వవిధానాల పాత్రకూడా కీలకం. ఆయు ష్ మంత్రిత్వశాఖ ద్వారా ఆయుర్వేదాన్ని ప్రోత్సహిస్తున్నామ ని చెప్పుకుంటున్నప్పటికీ, భూమి స్థాయిలో పేదలకు అందు బాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు తక్కువగానే కనిపిస్తు న్నాయి. బంగారం, వెండి వంటి లోహాల ధరల పెరుగుదల వల్ల ఏర్పడిన ఖర్చును భరించేందుకు ఆయుర్వేద ఔషధ తయారీదారులకు ప్రత్యేక సబ్సిడీలు ఇవ్వడం, ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రుల్లో స్వర్ణ (Gold), రాజత భస్మ ఆధారిత మం దులను ఉచితంగా లేదా తక్కువ ధరకు అందించడం వంటి చర్యలు అవసరం. అదే సమయంలో ఆయుర్వేద వైద్యులు, పరిశోధకులు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సంప్రదాయాన్ని గౌరవిస్తూనే, తక్కువ ఖర్చుతో సమాన ఫలి తాలు ఇచ్చే ప్రత్యామ్నాయ ఔషధ సూత్రాలను అభివృద్ధి చేయడం కాలానుగుణ అవసరం. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, లోహాల వినియోగాన్ని తగ్గిస్తూ లేదా సమర్థవంతంగా వినియోగించే విధానాలపై పరిశోధన జరగాలి. అలా చేసినప్పుడే
ఆయుర్వేదం’ఎలైట్ మెడిసిన్’గా కాకుండా ‘పబ్లిక్ మెడిసిన్’గా నిలుస్తుంది. మరోవైపు ప్రజల్లో నూ అవగాహన పెరగాలి. ఆయుర్వేదం అంటే తప్పనిసరిగా ఖరీదైన స్వర్ణ భస్మలే కావాలన్న భావనతప్పు. ఆహార నియ మాలు, జీవన శైలి మార్పులు, స్థానికంగా లభించే ఔషధ మొక్కల వినియోగం వంటి అంశాలు కూడా ఆయుర్వేదం లో అంతే ముఖ్యమైనవి. వీటిని ప్రోత్సహించడం ద్వారా చికిత్స ఖర్చును తగ్గించవచ్చు. మొత్తానికి బంగారం, వెండి ధరల పెరుగుదల ఆయుర్వేద వైద్యాన్ని పేద ప్రజలకు అందని ద్రాక్షగా మారుస్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తు న్నాయి. అయితే ఇది అనివార్యమైన పరిస్థితి కాదు. సరైన ప్రభుత్వ విధానాలు, శాస్త్రీయ పరిశోధనలు, సామాజిక బాధ్యత కలిగిన వైద్య దృక్పథం కలిసివస్తే, ఆయుర్వేదాన్ని మళ్లీ ప్రజల వైద్యంగా నిలబెట్టవచ్చు. లేనిపక్షంలో, భారతీ య సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఈ పురాతన వైద్య శాస్త్రం, కొద్ది మందికే పరిమితమైపోయే ప్రమాదం ఉంది. ఈ విషయంలో ఇప్పుడే చైతన్యం అవసరం లేదంటే ఆయుర్వేదం పేరు మాత్రమే మిగిలి, ప్రజల ఆరోగ్యానికి దూరమయ్యే పరిస్థితి తలెత్తుతుంది.
– తిప్పర్తి శ్రీనివాస్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also :