వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుతం అందరినీ డయాబెటిస్ ఇబ్బందులకు గురి చేస్తోంది. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, శారీరక వ్యాయామం లేకపోవడం వంటి అనేక కారణాల వల్ల డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఇది దీర్ఘకాలం పాటు ఉండే అనారోగ్య సమస్య. అంతేకాకుండా ఒక్కసారి ఈ అనారోగ్య సమస్య బారిన పడితే జీవితాంతం మందులు మింగుతూ ఈ సమస్యతో బాధపడాల్సిందే అని అందరికీ తెలిసిందే. అయితే క్రమశిక్షణ కలిగిన ఆహారం, వ్యాయామం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించుకుని డయాబెటిస్ (Diabetes)నుండి బయటపడవచ్చని వైద్యులు తెలియజేస్తున్నారు. కాలక్రమేణా డయాబెటిస్ తీవ్రమవుతుందే తప్ప తగ్గదు అని భావించే వారు చక్కటి జీవనశైలిని పాటించడం వల్ల డయాబెటిస్ (Diabetes)ను తిప్పికొట్టవచ్చని వారు చెబుతున్నారు. డయాబెటిస్ తో బాధపడే వారు ముఖ్యంగా అల్పాహారంలో కార్బొహైడ్రేట్లను స్థిరంగా తీసుకుంటూ ఉండాలి. రక్తంలో చక్కెర పెరుగుదలను నివారించడానికి ప్రతి భోజనానికి సుమారు 60 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ను మాత్రమే తీసుకోవాలి. వీటితో పాటు ఆకుకూరలు, కాయ ధాన్యాలు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర శోషణ మందగిస్తుంది. ఆహారంతో పాటు డయాబెటిస్ తో బాధపడే వారు వ్యాయామం చేయడం కూడా చాలా సులభం. వ్యాయామం చేయడం వల్ల గ్లూకోజ్ ను శరీరం సమర్థవంతంగా గ్రహించగలదు. డయాబెటిస్ తో బాధపడే వారు కార్డియో చేయడం కంటే బరువులు ఎత్తడం, శరీర బరువు వ్యాయామాలు చేయడం డయాబెటిస్ ను తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
Read Also: Gardening: ఆరోగ్యానికి మేలు చేసే మైక్రోగ్రీన్స్‌ను ఇలా పెంచండి

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, చక్కటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఇన్సులిన్ పై ఆధారపడకుండానే డయాబెటిస్ ను తగ్గించుకోవచ్చని వారు సూచిస్తున్నారు. నిర్మాణాత్మక జీవనశైలి మార్పులు మన ఆరోగ్యంలో చాలా పెద్ద తేడాను తీసుకువస్తాయని ఇవి మొత్తం శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని వైద్యులు తెలియజేస్తున్నారు. డయాబెటిస్ రివర్సల్ అనేది నిపుణుల పర్యవేక్షణలో చేయడం మంచిది అని సలహా ఇస్తున్నారు. ఇది అందరికీ వర్తించదని ప్రారంభదశలో ఉన్న వారు దీనిని పాటించడం వల్ల ఉపశమనం కలుగుతుందని అయితే దీర్ఘకాలం పాటు డయాబెటిస్ ఉండడంతో పాటు తీవ్రంగా ఉన్నవారు డయాబెటిస్ నుండి పూర్తిగా బయటపడకపోవచ్చని వారు చెబుతున్నారు. డయాబెటిస్ తో బాధపడే వారు ముందుగా రోజువారి అలవాట్లతో ప్రారంభించి అలాగే స్థిరంగా ఉండడం వల్ల మందులను కూడా నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ కు ఖరీదైన మందులు వాడే వారు చక్కటి జీవనశైలిని, ఆహార నియమాలను పాటించడం, వ్యాయామం చేయడం వల్ల డయాబెటిస్ తగ్గడంతో పాటు మందుల వాడకం కూడా తగ్గించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: