రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలే ప్రాణాంతకంగా మారుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాణ్యమైన హెల్మెట్ (Helmet) వాడకం అత్యంత కీలకమని వారు సూచిస్తున్నారు. ప్రాణాలను రక్షించే సాధనంగా హెల్మెట్‌ను చూడాలని చెబుతున్నారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ఒక అదనపు భద్రత కాదు, అది జీవితానికి భరోసా అని స్పష్టం చేస్తున్నారు.
Read also: Magnesium Foods : దీర్ఘకాలిక ఆరోగ్యంలో మెగ్నిషియం పాత్ర

Two Wheeler Safety
ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్ ఎందుకు ముఖ్యం
తక్కువ ధరకే లభిస్తున్నాయని నాసిరకం హెల్మెట్లు వాడటం ప్రమాదకరమని నిపుణుల అభిప్రాయం. ప్రమాద సమయంలో ఇవి సరైన రక్షణ ఇవ్వలేవని హెచ్చరిస్తున్నారు. తప్పనిసరిగా ఐఎస్ఐ (IS 4151-2015) మార్క్ ఉన్న హెల్మెట్‌ను మాత్రమే ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ఐఎస్ఐ ప్రమాణాల గురించి మరింత సమాచారం కోసం ఈ లింక్ చూడవచ్చు
సరైన హెల్మెట్ ఎంపికలో పాటించాల్సిన జాగ్రత్తలు
పుల్ ఫేస్ హెల్మెట్, తలకు సరిపోయే సైజు, బలమైన చిన్స్టాప్ ఉన్నదే భద్రతకు సరైన ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు. కేవలం రూ.500 తక్కువ ధర కోసం నాణ్యతలో రాజీ పడితే జీవితానికే ముప్పు ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. హెల్మెట్ కొనుగోలు సమయంలో భద్రత, సౌకర్యం, ప్రమాణాలపై పూర్తి దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. మంచి హెల్మెట్ ఒక ఖర్చు కాదు, అది ప్రాణాలకు పెట్టే పెట్టుబడి అని వారు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: