हिन्दी | Epaper

US: టారిఫ్ లపై ఫ్రాన్స్ ను హెచ్చరించిన ట్రంప్

Vanipushpa
US: టారిఫ్ లపై ఫ్రాన్స్ ను హెచ్చరించిన ట్రంప్

ఇష్టానుసారంగా విధిస్తోన్న టారిఫ్ లతో భారత్ సహా అన్ని దేశాలనూ బెంబేలెత్తిస్తోన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యాను బద్ధశత్రువుగా పరిగణిస్తోన్నారు. ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న.. ప్రత్యేకించి- క్రూడాయిల్ కొనుగోలు చేస్తోన్న దేశాలన్నింటిపైనా విరుచుకుపడుతున్నారు. కొరడా ఝుళిపిస్తోన్నారు. ఈ క్రమంలో భారత్ పై ఇప్పటికే ఎకాఎకిన 50 శాతం అదనపు టారిఫ్ లను విధించారు డొనాల్డ్ ట్రంప్. తనకు నచ్చని దేశాలపై టారిఫ్ ను విధించడంలో వెనుకాడట్లేదాయన. ఇప్పుడు తాజాగా ఫ్రాన్స్‌(France) పై టారిఫ్ కు దిగారు. ఆ దేశంతో దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో టారిఫ్ అస్త్రాన్ని సంధించనున్నారు. అమెరికా ప్రతిపాదించిన బోర్డ్ ఆఫ్ పీస్ లో చేరడానికి ఫ్రాన్స్ విముఖత వ్యక్తం చేయడం దీనికి కారణమైంది. అమెరికా దిగుమతి చేసుకునే ఫ్రెంచ్ వైన్, షాంపేన్‌పై 200 శాతం టారిఫ్ ను విధిస్తామని ట్రంప్ తాజాగా హెచ్చరించారు.

Read Also: Portugal elections 2026 : పోర్చుగల్ అధ్యక్ష ఎన్నికలు నేడు, కొత్త చరిత్ర రాయనా?

 US: టారిఫ్ లపై ఫ్రాన్స్ ను హెచ్చరించిన ట్రంప్
US: టారిఫ్ లపై ఫ్రాన్స్ ను హెచ్చరించిన ట్రంప్

తాజా పరిణామాలు యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఆందోళన

బోర్డ్ ఆఫ్ పీస్ లో ఫ్రెంచ్ సహకారాన్ని తీసుకోవడానికి వెనుకాడబోనని, ఆ దేశాన్ని తన దారికి తెప్పించుకోవడానికి ఆర్థికపరమైన ఒత్తిళ్లను తీసుకొస్తానని అన్నారు. టారిఫ్ ద్వారా ఒత్తిడిని తీసుకొస్తానని తేల్చి చెప్పారు. ఫ్రాన్స్ నుంచి దిగుమతి అయ్యే వైన్, షాంపేన్ పై 200 శాతం టారిఫ్ విధించనున్నట్లు తెలిపారు. వైన్‌లు, షాంపైన్‌లపై 200 శాతం టారిఫ్ విధిస్తాననని, అప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మక్రాన్ ఖచ్చితంగా దారికి వస్తాడని, బోర్డ్ ఆఫ్ పీస్ లో చేరుతాడని వ్యాఖ్యానించారు. బోర్డ్ ఆఫ్ పీస్ లో చేరడానికి ఫ్రాన్స్ అయిష్టతను వ్యక్తం చేసిన కొద్దిసేపటికే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ తాజా పరిణామాలు యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఆందోళనలను పెంచింది. అమెరికాకు వైన్ ఎగుమతుల వల్ల భారీగా ఆదాయాన్ని పొందుతోంది ఫ్రాన్స్. ఇది ఆ దేశ ప్రతిష్ట, జాతీయ గుర్తింపుకు చిహ్నంగా పరిగణిస్తుంటారు. వాటిపై ఏకంగా 200 శాతం టారిఫ్ విధించితే రెండు మిత్రదేశాల మధ్య శతాబ్దాల కాలంగా కొనసాగుతూ వస్తోన్న వాణిజ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయనే అభిప్రాయాలు ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

AI నేర్చుకోకపోతే ప్రమోషన్ లేదు.. ఉద్యోగం కూడా కష్టమే!

AI నేర్చుకోకపోతే ప్రమోషన్ లేదు.. ఉద్యోగం కూడా కష్టమే!

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

దుబాయ్‌లో ఆకాశానికి నిత్యావసరాల ధరలు

దుబాయ్‌లో ఆకాశానికి నిత్యావసరాల ధరలు

గ్యాస్ కొరత: గ్యాస్ స్టవ్‌కు ప్రత్యామ్నాయాల వైపు పరుగులు

గ్యాస్ కొరత: గ్యాస్ స్టవ్‌కు ప్రత్యామ్నాయాల వైపు పరుగులు

📢 For Advertisement Booking: 98481 12870