చట్టం అందరికీ సమానమని నీతులు చెప్పే డీజీపీ వద్ద ఉన్న ఖాకీ బుక్ ఇప్పుడు ఎక్కడికి వెళ్లిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తీవ్రంగా ప్రశ్నించారు. “ఖాకీ బుక్‌ను కాకి ఎత్తుకుపోయిందా?” అంటూ పోలీసుల వ్యవహార శైలిపై ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలపై వరుసగా ఆరోపణలు వస్తున్నా పోలీసులు మౌనం పాటిస్తున్నారని, అదే సమయంలో జర్నలిస్టులు, బీఆర్ఎస్ నేతలపై మాత్రం సిట్‌లు, కమిషన్లు వేయడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
Read also: TG Municipal elections: ఎన్నికల నిర్వహణకు తగు సూచనలు

Harish Rao lashed out at MLA Sampath Kumar
సంపత్‌కుమార్ కేసులో ఎందుకు చర్యలు లేవు?
అలంపూర్‌లో సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా చెప్పబడుతున్న ఏఐసీసీ నేత, ఎమ్మెల్యే సంపత్‌కుమార్ కాంట్రాక్టర్లను రూ.8 కోట్లకు బెదిరించాడనే ఆరోపణలు తీవ్రమైనవని హరీశ్ రావు గుర్తు చేశారు. ఈ వ్యవహారంలో బాధిత కాంట్రాక్టరే స్వయంగా ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి అరెస్ట్ జరగలేదని ప్రశ్నించారు. ఇంత స్పష్టమైన ఆరోపణలున్నా ఈ కేసులో సిట్ ఎందుకు ఏర్పాటు చేయలేదని నిలదీశారు. చట్టం ఒకటైతే, నియమాలు అందరికీ ఒకేలా ఉండాలన్నారు.
సీఎం బాధ్యతపై ప్రశ్నలు, హెచ్చరిక
జర్నలిస్టులపై సిట్ ఏర్పాటు విషయమే సీఎంకు తెలియదని చెబితే, అది రాష్ట్ర పరిపాలనలో తీవ్ర వైఫల్యమేనని హరీశ్ రావు (Harish Rao) వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి నాయకత్వం వహించే ముఖ్యమంత్రి జరుగుతున్న పరిణామాలపై అవగాహన లేకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు. చట్టాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడితే ప్రజలు తప్పకుండా తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో పోలీస్ వ్యవస్థ నిష్పక్షపాతంగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: