हिन्दी | Epaper

Peter Navarro: భారత్‌పై చౌకబారు వ్యాఖ్యలు చేసిన ట్రంప్ అడ్వైజర్

Vanipushpa
Peter Navarro: భారత్‌పై చౌకబారు వ్యాఖ్యలు చేసిన ట్రంప్ అడ్వైజర్

రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు పట్టుకున్న డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచ దేశాలతో కయ్యాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. భారత్‌పై టారిఫ్స్ అంటూ బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రంప్ బృందంలోని సభ్యులు కూడా భారత్‌పై చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారు. అందులో ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో (Peter Navarro) ముందున్నారు. ఇప్పటికే భారత్‌పై ఈయన పలుమార్లు అనుచిత వ్యాఖ్యలు చేశారు.

Read Also: Silver price today : వెండి ధర షాక్! రూ.3 లక్షల మార్క్ దాటబోతోందా?

Peter Navarro: భారత్‌పై చౌకబారు వ్యాఖ్యలు చేసిన ట్రంప్ అడ్వైజర్
Peter Navarro: భారత్‌పై చౌకబారు వ్యాఖ్యలు చేసిన ట్రంప్ అడ్వైజర్

భారత్‌పై విషం కక్కిన పీటర్ నవారో

రష్యా నుంచి చమురు కొంటున్న భారత్.. దానిని తిరిగి ఎక్కువ ధరకు అమ్ముకుని లాభాలు గడిస్తోందిని, భారత్ చాకిరేవు దుకాణం నడుపుతోందని నోరు పారేసుకున్నారు పీటర్ నవారో. ఆ తర్వాత మరో మెట్టు ఎక్కి కులాల ప్రస్తావన తీసుకువచ్చారు. భారతీయుల పేరుతో ఆయిల్ కొంటూ.. సంపన్నవర్గాలు లాభాలు గడిస్తున్నాయంటూ ఆరోపించారు. తాజాగా మళ్లీ భారత్‌పై విషం కక్కారు పీటర్ నవారో. భారత్ వంటి దేశాల్లో అమెరికా ఏఐ కంపెనీలు సేవలు అందించడాన్ని ఆయన తప్పుపట్టారు.

వాస్తవ ధర కంటే పది రెట్లు ఎక్కువ ధరకు కొనుగోలు

చాట్‌జీపీటీ వంటి కృత్రిమ మేధ (ఏఐ) ప్లాట్‌ఫామ్‌లు అమెరికా భూభాగంపై వనరులను ఉపయోగిస్తున్నాయని పీటర్ నవారో అన్నారు. ఆయా సంస్థలు అమెరికాలోని విద్యుత్‌ను ఉపయోగించి పనిచేస్తున్నాయని చెప్పారు. కానీ, భారత్‌ వంటి దేశాల్లో పెద్ద సంఖ్యలో యూజర్లకు సేవలు అందిస్తున్నాయని అన్నారు. భారత్‌లో ఏఐ సేవల కోసం అమెరికన్లు ఎందుకు డబ్బులు చెల్లిస్తున్నారు? అని నవారో ప్రశ్నించారు. అంతేకాకుండా ఇతర దేశాలకు చెందిన సంస్థలు అమెరికాలో వ్యవసాయ భూములను.. వాస్తవ ధర కంటే పది రెట్లు ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నాయన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఉగాది రోజు అమావాస్య.. పండితుల అభిప్రాయం ఇదే!

ఉగాది రోజు అమావాస్య.. పండితుల అభిప్రాయం ఇదే!

ఎంబీబీఎస్ డాక్టర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

ఎంబీబీఎస్ డాక్టర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

యుద్ధం ఎక్కడో.. సెగ ఇక్కడ! మూతపడుతున్న హోటళ్లు

యుద్ధం ఎక్కడో.. సెగ ఇక్కడ! మూతపడుతున్న హోటళ్లు

గ్యాస్ దొంగల బీభత్సం.. పట్టపగలే సిలిండర్లు మాయం!
1:21

గ్యాస్ దొంగల బీభత్సం.. పట్టపగలే సిలిండర్లు మాయం!

పెళ్లి నిరాకరించిన వరుడు.. విషం తాగి తల్లీకూతుళ్లు మృతి

పెళ్లి నిరాకరించిన వరుడు.. విషం తాగి తల్లీకూతుళ్లు మృతి

బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్

బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్

మూడు నెలలుగా భోజనం చెత్త బుట్టల్లో.. ఎన్టీఆర్ జిల్లాలో కలకలం
0:14

మూడు నెలలుగా భోజనం చెత్త బుట్టల్లో.. ఎన్టీఆర్ జిల్లాలో కలకలం

రుతుస్రావ సెలవులు చట్టం చేస్తే మహిళ ఉపాధికే అడ్డంకి: సుప్రీంకోర్టు

రుతుస్రావ సెలవులు చట్టం చేస్తే మహిళ ఉపాధికే అడ్డంకి: సుప్రీంకోర్టు

విజయవాడలో గ్యాస్ కోసం ప్రజల పడిగాపులు
0:03

విజయవాడలో గ్యాస్ కోసం ప్రజల పడిగాపులు

మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి లో ఏసీబీ సోదాలు?

మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి లో ఏసీబీ సోదాలు?

ఏనుగు బీభత్సం.. వ్యక్తి మృతి!
0:51

ఏనుగు బీభత్సం.. వ్యక్తి మృతి!

మెట్రో స్టేషన్‌లోనే సెల్ఫ్ సర్వీస్ ప్రింటింగ్ సెంటర్

మెట్రో స్టేషన్‌లోనే సెల్ఫ్ సర్వీస్ ప్రింటింగ్ సెంటర్

📢 For Advertisement Booking: 98481 12870